మురుగు కాలువ లో బురద పూసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగానే ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తూ ఉంటారు. కానీ కరోనా వైరస్ సమయంలో శుభ్రత కాదు అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు. చిన్న విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. శుభ్రత పరిశుభ్రత అంటూ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. అయితే సాధారణంగా మురుగు కాలువల వైపు చూడటానికి చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ మురుగు కాలువల వైపు చూడటం గాని అటు వైపు వెళ్తూ వాసన పీల్చుకోవడం మాత్రం అందరికీ కోపాన్ని తెప్పిస్తుంది అనీ చెప్పాలి.. ఇలా మురుగు కాలువల్లో ఉండే వాసన దాదాపు ఎవరికీ ఇష్టం ఉండదు.

 కానీ ఇక్కడ మాత్రం ఏకంగా మురుగు కాలువ లే వారికి ఎంజాయ్ చేయడానికి వేదికగా మారిపోయాయి. అందరూ కనీసం మురుగు కాలువల వైపు చూడటానికి చిరాకు పడుతూ ఉంటే.. ఇక్కడ మాత్రం ఏకంగా మురుగు కాలువల్లో ఉన్న బురద మొత్తం ఒంటినిండా పోసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. ఇక్కడ కొంతమంది ఇక మురుగు కాల్వల నుంచి వచ్చే దుర్వాసనను కూడా సువాసన లాగా భావిస్తూ సంబరపడిపోతున్నారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదా. కానీ ఇది నిజంగా జరిగింది. అయితే ఇది ఎక్కడో జరిగింది కాదు ఏకంగా ఏపీలోని విశాఖ జిల్లాలో జరగడం గమనార్హం.

 అప్పుడప్పుడూ కొన్ని వింత ఆచారాలు బయటపడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.. విశాఖ జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గం దిమిలి గ్రామంలో వింతైన పండుగ జరుగుతుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అక్కడ బురదమాంబ జాతర చేసుకుంటారు గ్రామస్తులు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున మూడు గంటల నుంచి 10 గంటల వరకు కూడా పురుషులంతా వేప కొమ్మలతో మురుగు కాలువ లో ఉన్న బురదను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఇలా హోలీ రోజు రంగులు శరీరమంతా పూసుకున్నట్లు గానే ఇక మురుగు కాలువలో బురద పూర్తి మొత్తం శరీరమంతా పూసుకుని ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధుల నుండి దేవత కాపాడుతుంది అని అక్కడి ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: