కొండపల్లి ఎన్నిక ఏమైంది...? టీడీపీ ,వైసీపీ మాట ఏంటీ...?
బయటకు వచ్చేసిన వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్... కేశినేని నానీ లక్ష్యంగా విమర్శలు చేసారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు అని మా సభ్యులు ఎటువంటి అల్లర్లు చేయలేదు అని స్పష్టం చేసారు. నాని ఎన్నిక చెల్లదని మాత్రమే మేము అభ్యంతరం వ్యక్తం చేశామని ఆయన స్పష్టం చేసారు. ఎన్నికల అధికారి అధికారికంగా వాయిదా వేసినట్లు ఆర్డర్ ఇచ్చారు అని వివరించారు. అందుకే బయటకు వెళ్లిపోతున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఎంపి నానీ ఓటు హక్కు విషయం కోర్టు పరిధిలో ఉంది అని తెలిపారు ఆయన. దాని మీద మేమేమీ మాట్లాడబోం అని స్పష్టం చేసారు.
కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయిన ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికకు అవకాశం లేకుండా పోయింది అని ఆయన తెలిపారు. సర్ది చెప్పినా సభ్యలు తగ్గలేదు అని అన్నారు. పరిస్థితి ఎన్నికకు అవకాశం లేకుండా మారిపోయిందని వివరించారు. అందుకే ఎన్నికను వాయిదా వేశాము అని ఆయన వ్యాఖ్యానించారు. లోపలే ఉన్న టీడీపీ సభ్యులు గురించి అడిగితే... స్పందించకుండా ఆయన మీడియా వద్ద నుంచి వెళ్ళిపోయారు. ఇక తమకు న్యాయం చేయాలని రెండు పార్టీలు కూడా డిమాండ్ చేసిన నేపధ్యంలో ఏం జరుగుతుందా అనే ఉత్కంట నెలకొంది.