జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మా శ్రీ‌కాకుళం అలానే ఎలానో?

RATNA KISHORE
వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు స‌రిక‌దా స్థానిక నాయ‌కులు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం క‌బుర్లూ కాక‌ర‌కాయ‌లూ చెబుతూ కాలం వెళ్ల‌దీయ‌డం వీరి హాబీ!

అసెంబ్లీ లో జ‌రుగుతున్న ర‌గ‌డ గురించి ఛానెళ్ల‌న్నీ అదే ప‌నిగా మాట్లాడుతున్నాయి. అదే ప‌నిగా మాట్లాడిస్తున్నాయి. మంచిది ఇదే కావాలి జ‌నాల‌కు..ఇదే కావాలి  మిగతా ప్రేక్ష‌కుల‌కు కూడా! అని అనుకోవ‌డం వాళ్ల అవివేకం. అందువ‌ల్ల‌నో ఎందువ‌ల్ల‌నో స‌మ‌స్య‌లు అన్నీ దాగుండి పోయాయి. నీళ్లతో నిండిన ర‌హ‌దారులు..వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన రోడ్లు.తెగిప‌డ్డ వాగులూ వంక‌లూ.. అడ్డూ అదుపూ లేని జ‌లాశ‌య ప్ర‌వాహాలు.. వృథా గా పోతున్న నీటి ప్ర‌వాహాలు.. భారీగా కూలిన చెట్లు...ఇవేవీ వాళ్ల‌కు క‌నిపించ‌క‌పోవ‌డంలో గుడ్డిత‌నం ఉంది. దీనినెవ్వ‌రూ కాద‌న‌రు. ఇదే సంద‌ర్భంలో నాయ‌కులంతా ఒక‌రిని ఒక‌రు తిట్టుకోవ‌డంలో అవివేకం ఉంది. దీనిని కూడా కాద‌న కూడదు. అంటే ప్ర‌మాదం కూడా! ఎందుకంటే ఇప్పుడు తిట్టుకుంటున్న నాయ‌కులు నాట‌కంలో భాగంగా తిట్టుకుంటున్నారు. వాస్త‌వంలో భాగంగా కాదు ఈ విష‌యం అంతా గుర్తించాలి. అవ‌శేషాంధ్ర‌కు ఇంత‌టి గ‌తి ప‌ట్టించిన నాయ‌కులు అటూ ఉన్నారు ఇటూ ఉన్నారు.
ఈ తంతంతా ముగిసేలోగా, ఈ తతంగాన్ని ముగించేలోగా కొత్త ప్ర‌భుత్వం ఒక‌టి వ‌చ్చి ప‌డ్తది. ఈ లోగా ఎవ‌రి ధ్యాస‌లో వారు ప‌డిపోతారు. ఎవ‌రి క‌థ‌ను వారు ప్ర‌త్యేకంగా వండి వారుస్తారు. మ‌రి! మా శ్రీ‌కాకుళం ఏం కావాలి. స‌రిగా లేని మా  ఊరి రోడ్ల‌కు ఎప్పుడు మోక్షం ద‌క్కాలి. డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేని మా ఊరికి ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా చేసిందేం లేదు. ఏళ్లు దాటినా అవే రోడ్లు. అవే డ్రైన్లు. కొంచెం కూడా ప‌ద్ధ‌తిగా లేని ట్రాఫిక్. ఇంకా ఏవేవో ఎన్నెన్నో! మా ఊరి గురించి మా వెనుక‌బాటు గురించి ఎన్నిక‌ల స‌మ‌యంలో మాట్లాడే పెద్ద‌లంతా ఇప్పుడు అసెంబ్లీలో అటో ఇటో ఉన్నారు. ఉంటే ఉన్నారు కానీ వెనుక‌బాటుకు కార‌ణం మాత్రం ఎవ్వ‌రూ చెప్పరు. చెప్పినా త‌రువాత కాలంలో వాటి ప‌రిష్కారానికి ఎవ్వ‌రూ బాధ్య‌త వ‌హించరు.
మంచి ఆస్ప‌త్రులు లేని గ్రామాలు, రోడ్లు లేని గ్రామాలు, మంచి నీటి సౌక‌ర్యం లేని గ్రామాలు ఇప్ప‌టికీ ఉన్నాయి. వీటి గురించి నాయ‌కులంతా వేర్వేరు సంద‌ర్భాల్లో భావోద్వేగాల‌కు లోన‌వుతారు. మా ప్రాంత స‌మ‌స్య‌ల గురించి బాగా పట్టింపు ఉన్న‌వారిలా బిల్డ‌ప్ ఇస్తారు. కానీ త‌రువాత వాస్త‌వం  మ‌రోలా ఉంటుంది. అలా ఉండేందుకు ప‌రిస్థితులే స‌హ‌క‌రిస్తాయి. ఇప్పుడు మా ఊరికి మంచి రోడ్లు లేవు. వెంట‌నే వేస్తారా పోనీ ఆ కొట్టుకుంటున్న ఆ రెండు పార్టీల‌కూ అంత సీన్ ఉందా? ఇక మా ఊరికి సంబంధించి ఎప్ప‌టి నుంచో ఊరిస్తున్న అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక‌టి వ‌చ్చి తీరుతుందా... ఏం చేయ‌గ‌ల‌రు అని.. ఏళ్ల త‌ర‌బ‌డి అభివృద్ధి లేక ఉండిపోయిన గిరిజ‌న తండాల‌కు మీరేం చేశార‌ని? ఇవేం కాకుండా ఇవేవీ మాట్లాడ‌కుండా వీరేంటో తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. వీటి వ‌ల్ల మా ఊరు బాగు పడిందే లేదు. మా నాగావ‌ళి శుభ్ర‌ప‌డిందే లేదు. మా వంశధార నీళ్లు చివ‌రి ఆయ‌కట్టుకు చేరిందే లేదు. కానీ మా పేద‌రికం మా వెనుక‌బాటు మా అవివేకం మా నిర‌క్ష్య రాస్య‌త మా నాయ‌కుల‌కు బ‌లం.
మా నాయ‌కుల‌కు అదే బూస్టు మ‌రియు హార్లిక్సూ !
 

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: