అచ్చెన్న వర్సెస్ జగన్: వాడీ వేడిగా ఏపీ అసెంబ్లీ

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఆరు రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఈ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి ఏంటీ అనేది ఆసక్తిగా మారింది. ఈ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు సిద్దంగానే ఉంది. ఇక విపక్షం ఈ సమావేశాల్లో ఏ అంశాలను ప్రస్తావిస్తుంది ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మహిళా సాధికారిత గురించి ఏపీ అసెంబ్లీలో చర్చ జరగగా... అసెంబ్లీలో సీఎం ప్రసంగంపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి ఎక్కడిది? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
మహళా సాధికారతపై అసెంబ్లీలో తీర్మానం అంకెల గారడీనే అని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డకు రక్షణ కరువు అయ్యింది అని అన్నారు ఆయన. గడిచిన రెండున్నరేళ్లలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయి అని ఆరోపణలు చేసారు. లైంగిక వేధింపుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఏపీ ఉంది అని అన్నారు. నాసిరకం మద్యం పోసి మహిళల మాంగల్యాలు మంట గలుపుతున్నారు అని మండిపడ్డారు. అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా ఏడాదికి రూ.40 వేలు లాగేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
గంజాయి, హెరాయిన్‌ తో పెరిగిన గృహహింస పెరిగింది అని అన్నారు అచ్చెన్న. తుగ్లక్ చర్యలతో డ్వాక్రా నిర్వీర్యం అయ్యింది అని ఆయన ఆరోపణలు చేసారు. డ్వాక్రా సున్నా వడ్డీ 5 లక్షల నుంచి 3 లక్షలకు కుదించడం దగా కాదా? సీఎం సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు జగన్  టోకరా  వేశారు అని అన్నారు. సెంటు పట్టా పేరుతో రూ. 7 వేల కోట్ల స్కామ్  జరిగింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అసైన్ మెంట్ భూములు బలవంతపు స్వాధీనం చేసుకుంటున్నారు అని మండిపడ్డారు. పింఛను పెంచుతామని వంచించి వాస్తవాం కాదా? సీఎం చెప్పాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: