అప్పుడు హిట్లర్.. ఇప్పుడు జిన్పింగ్?

praveen
ప్రస్తుతం అన్ని దేశాలలో కూడా పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. ప్రతిసారి ఎన్నికలు జరగడం ప్రజలు తీర్పు ఇచ్చి ఓట్లు వేసిన వ్యక్తి పరిపాలన సాగించేందుకు అధికారం చేపట్టడం లాంటివి జరుగుతుంది. ఇలా దాదాపుగా అన్ని దేశాలలో కూడా  ఎన్నికల్లో గెలిచి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి పాలన సాగిస్తూ ఉండడం గమనార్హం. కానీ చైనాలో మాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది పాలన. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు హిట్లర్, తుగ్లక్ ఇక ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అని చెప్పాలి. రానురాను జిన్ పింగ్ నియంతృత్వం అంతకంతకు  ఎక్కువైపోతుంది.

అయితే ఇక చైనాలో ఎలాంటి ఎన్నికల ఉండవు ప్రజలకు ఓటు హక్కు ఉండదు.. ఎవరిని ఎన్నుకోవడం కూడా ఉండదు. ఇక చైనాలో ఒక పాలకుడే. అతను చెప్పినట్లే అందరూ వినాలి. అతను చెప్పిందే వేదం.. అతను మాట్లాడింది శాసనం.. ఎవరైనా ఎదురుతిరిగితే వారికి మరణ శాసనం. ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నియంత పాలనకి దగ్గరగా జిన్పింగ్ చైనాలో పాలన సాగిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తనని తాను చైనా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు జిన్పింగ్. కాగా ప్రస్తుతం జిన్పింగ్ తీరు కాస్త ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ హాట్ టాపిక్ గా మారిపోతుంది.

 ఇక ఇటీవలే మరో సారి చైనా కమ్యూనిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా జిన్పింగ్ నే నియామిస్తున్నాము అంటూ తెలిపింది. అయితే పార్టీ మొత్తాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ఇక మరో సారి చైనా కమ్యూనిస్టు పార్టీకి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు జిన్పింగ్. అయితే ఈ పార్టీలో అప్పుడప్పుడు జిన్పింగ్ కు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించాయి. కానీ వారిపై కేసులు పెట్టడం.. తప్పుడు ఆరోపణలు చేయడం లాంటివి చేసి జైలు పాలు చేశారు. ఇలా తనకు ఎదురు తిరిగిన వారిని కూడా జైలు పాలు చేస్తూ ఓ వైపు పార్టీకి మరోవైపు దేశానికి కూడా శాశ్వత అధ్యక్షుడిగా మారిపోతున్నారు జిన్పింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: