బద్వేలు : లోకేష్ సోదిలో కూడా లేడేం ?

VUYYURU SUBHASH
నాలుగేళ్ల లోనే లోకేష్ సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడు క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక వ‌చ్చింది. అక్క‌డ గెలిచేందుకు చంద్ర‌బాబు టీం చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కో వార్డుకు ఏకంగా ఇద్ద‌రేసి ఎమ్మెల్యేల‌ను ఇన్‌చార్జ్‌లుగా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేత‌లు అంద‌రిని అక్క‌డ రంగంలోకి దింపి మ‌రీ ప్ర‌చారం చేశారు. పైగా అది వైసీపీ సిట్టింగ్ సీటు. అయితే అక్క‌డ గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చింది. అయితే అది తాము గెలిచిన సిట్టింగ్ సీటు కాబ‌ట్టి తాము పోటీ పెడుతున్నామ‌ని చెప్పి మ‌రీ జ‌గ‌న్ అక్క‌డ శిల్పా మోహ‌న్ రెడ్డిని పోటీలోకి దింపారు. అక్క‌డ టీడీపీ చేసిన హ‌డావిడితో ఆ పార్టీ 27 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించింది.
ఇక ఇప్పుడు క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. అసలు జ‌గ‌న్ ఈ ఉప ఎన్నిక‌ను ఎంత మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. ఇక టీడీపీకి భ‌విష్య‌త్తు పార్టీ అధ్య‌క్షుడు అని మాత్ర‌మే కాకుండా.. ఆ పార్టీ నుంచి ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని ప్ర‌చారంలో ఉన్న యువ‌నేత లోకేష్ అస్స‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఒక వేళ ఇక్క‌డ నిజంగానే టీడీపీ త‌న క్యాండెట్ ను పోటీకి పెట్టి ఉన్నా లోకేష్ చేసేదేం ఉండ‌దు.
ఇది సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా.. పైగా ఈ జిల్లాలోని ప‌ది నియోజ‌క‌వ‌ర్గాలు వైసీపీ పెట్టిన‌ప్ప‌టి నుంచే ఆ పార్టీకి కంచు కోట‌లుగా ఉంటూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ లోకేష్ ఎంత ప్ర‌చారం చేసినా జిల్లా మొత్తం మీద టీడీపీకి ఒక్క సీటు వ‌చ్చినా గొప్పే అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది. ఇక్కడ టీడీపీ పోటీ పెట్టి లోకేష్ ప్ర‌చారం చేసి ఉంటే లోకేష్ ప‌రువు మ‌రింత దిగ‌జారి పోయి ఉండేద‌నే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: