చిత్తూరు వైసీపీలో మూడుముక్కలాట.. ఏం..?

MOHAN BABU
 అక్కడ అధికార పార్టీలో గ్రూపుల గోల ఎక్కువైపోయింది. ఎవరిని కదిలించినా ఏదో ఒక వర్గం అని గట్టిగానే వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పార్టీ నాయకులు వేస్తున్న ఎత్తులు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకులు అసలు ఏం జరుగుతోంది.. ఏమిటి ఆ నియోజకవర్గం..? చిత్తూరు వైసీపీలో నాయకులంతా కలిసి ఉన్నట్లు కనిపిస్తారు కానీ ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా జిల్లా మొత్తంలో ఓ రేంజ్లో గ్రూపుల నియోజకవర్గం గా మారిపోయింది. ఇక్కడ వైసీపీ నుంచి ఆర్ ఎం శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 లో మాత్రం భారీ మెజారిటీతో ఆరని ఎమ్మెల్యే గా ఆయన ఏ పని చేద్దామన్న పార్టీలోని  వర్గాలు బ్రేకులు వేస్తున్నాయట.

శ్రీనివాసులు వర్గాలకు కొంతమంది వేరే వాళ్ల సపోర్ట్ చేస్తుండడంతో మూడుముక్కలాట లా మారిపోయింది నియోజకవర్గంలోని అధికార పార్టీ పరిస్థితి. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా అక్కడ అనుచరులు ఉన్నారు. పార్టీ రీజినల్ చైర్మన్ విజయ్ ఆనంద్ రెడ్డి , పార్టీ నేత బుల్లెట్ సురేష్ మంత్రి అనుచరులుగా హడావిడి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో వీరిద్దరూ  ఆరని శ్రీనివాసులు కోసం పనిచేసిన తర్వాత ఎమ్మెల్యేతో ఎడముఖం పెడ ముఖంగా ఉంటున్నారు. చీమ చిటుక్కుమన్నా ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా గలమెత్తి పరిస్థితి ఉంది. అవకాశం చిక్కితే బల ప్రదర్శన కూడా దిగుతున్నారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ లో సీట్ల పంపకంలో మధ్య తేడాలు వచ్చినాయి.

ఆ గొడవలు ఇప్పుడు పిక్ స్థాయికి చేరినట్టు  టాక్ వినిపిస్తోంది. పార్టీ కోసం కష్ట పడిన వారికి కాకుండా ఒక వర్గానికి మాత్రమే ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం ఆరోపణలు వస్తున్నాయని అంటున్నారు మంత్రి అనుచరులు. వీరి మాటలకు గట్టిగానే కౌంటర్ వేశారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఇలా అంతా అధికార పార్టీ నేతలే అయినా  నిత్యం ఏదో ఒక వివాదంతో చిత్తూరు వైసీపీలో మూడుముక్కలాట చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: