పెట్రో మీటర్.. బ్రేక్ ఎక్కడ..?

Chandrasekhar Reddy
దేశంలో లాక్ డౌన్ నుండి ఇప్పటి వరకు పెట్రో మంట మండుతూనే ఉంది. అప్పటి నుండి పెరుగుతుండటంతో, ఒకపక్క లాక్ డౌన్ తో నే ధరలు పెరిగిపోతుంటే, మరోపక్క పెట్రో మంట తో ఈ ధరలు ఇంకా పెరిగిపోతున్నాయి. దీనితో సామాన్యుల పరిస్థితి చెప్పడానికి వీలుకానట్టుగా అయిపోతుంది. అసలే ఉండి లేక ఉన్న పనులు, ఎప్పుడు వస్తాయో తెలియని జీతాల తో సర్దుకుని బ్రతుకుతున్న వారిపై ఈ భారం మరింత ప్రభావాన్ని చూపుతుంది. ఇంధన ధరలు పెరిగిపోవడం వలన సామాన్యుడి వరకు చేరే ప్రతి వస్తువు ధర పెరిగిపోతూనే ఉంటుంది. దానితో కొనలేక, అవసరాలు మనుకోలేక ఒకపూట తిని ఒకపూట పస్తు తో బ్రతుకు ఈడ్చాల్సి వస్తుంది. అయితే ఈ పెట్రో మంట కూడా నేడో రేపో తీరుతుందా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.
ఆర్థికపరంగా కాస్త చేదోడువాదోడుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో పెట్రో ధరలు కేంద్రం తగ్గించడం అనే అంశం గురించి ఆలోచించడం లేదు కాబోలు లేదా దేశంపై ఆయా పరిస్థితుల ప్రభావం చేత ధరలు తగ్గించడం ద్వారా ప్రజల భారాన్ని తగ్గించినా, ప్రభుత్వం ఆదాయ మార్గాలు చూసుకునే విధానంలో మళ్లీ ఏదో ఒక పన్ను రూపంలో పెంచుతూనే ఉంటుంది. అయితే పన్ను కనపడదు కావచ్చు, ఇంధన ధరలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి, అంటే తేడా. {{RelevantDataTitle}}