ఇక అంబటికి ఆ ఛాన్స్ లేనట్లేనా.. జ‌గ‌న్ షాక్ త‌ప్ప‌దా...!

VUYYURU SUBHASH
అంబటి రాంబాబు....ఏపీ రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ నేత. పేరుకు సీనియర్ నేతగా ఉన్నా సరే అంబటికి అదృష్టం చాలా తక్కువగా ఉంది. అందుకే రాజకీయంగా పెద్దగా ఎదగకలేకపోయారు. మంచి మాటకారిగా పేరున్న సరే పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. మొదట నుంచి కాంగ్రెస్‌లో పనిచేసిన అంబటి...1989లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ తరుపున రేపల్లెలో పోటీ చేసి గెలిచారు.
ఇక తర్వాత నుంచి అంబటికి అదృష్టం కలిసిరాలేదు. పలుమార్లు ఓడిపోవడం గానీ, టిక్కెట్ దక్కకపోవడం గానీ జరిగింది. అయితే వైఎస్సార్ మరణంతో అంబటి...జగన్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో అంబటి సుడి తిరిగింది. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత అంబటి ఎమ్మెల్యేగా గెలిచారు. సత్తెనపల్లి బరిలో విజయం సాధించారు.
ఇక దీంతో అంబటి ఊపిరి పీల్చుకున్నారు. సీనియర్ కావడంతో మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా అంబటికి పదవి రాలేదు. అయితే మొదట విడతలో రాకపోయినా, ఈ సారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. కానీ ఈ సారి కూడా అంబటికి అదృష్టం ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే అంబటిపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. సరే ఆ ఆరోపణలని పక్కనబెట్టిన...కాపు కోటాలో పదవులు దక్కించుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు చూస్తున్నారు.
కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న కాపు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కోసం ఆతృతగా చూస్తున్నారు. ఇటు గుంటూరులో కూడా కిలారు రోశయ్య, అంబటికి పోటీ ఇస్తున్నారు. ఇక ఈ సమీకరణాల్లో మళ్ళీ అంబటికి మంత్రి పదవి దొరికే అవకాశాలు కనిపించడం లేదు. అయితే కాపు కోటాలో మంత్రి ప‌ద‌వులు రెండు గోదావ‌రి జిల్లా ల‌కు రెండు ఇవ్వాలి. ఇక విశాఖ జిల్లాలో ఖ‌చ్చితంగా ఒ క కాపు మంత్రి ఉంటారు. ఇక కృష్ణా జిల్లా లో పేర్ని నాని త‌ప్పిస్తే.. సామినేని ఉద‌య భాను రేసులో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మరి అంబటికి ఏమైనా లక్ ఉంటుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: