ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుడు.. చేసింది ఎవరు?

praveen
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అరాచకాలు సృష్టించి అధికారం లోకి వచ్చారు అనే విషయం తెలిసిందే. ఎన్నో అరాచకాలు సృష్టించి ప్రజాస్వామ్య పాలన మంట గలిపి ఇటీవలె  ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే తమ చట్టాల్లో మార్పులు తీసుకు వస్తామని ప్రజలను బానిసలు గా చూడము అంటూ ప్రకటించారు.  ఇలా ప్రపంచాన్ని నమ్మించేందుకు ఎన్నో రకాల స్టేట్మెంట్లు ఇచ్చిన ప్పటికీ క్రమ క్రమంగా వారి అసలు రూపాన్ని బయట పెడుతున్నారు తాలిబన్లు..

 ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణం గా మారి పోతుంది. ఎంతో మంది జనాలు ప్రాణ భయంతో విదేశాలకు పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఒకప్పుడు తాలిబన్లు ఆధిపత్యం లోకి రాక ముందు ఆఫ్ఘనిస్తాన్ లో అప్పుడప్పుడు బాంబు పేలుళ్లు లాంటివి జరిగేవి. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు మత రాజ్య స్థాపన కోసం తాలిబన్లు ఇలాంటి బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు అటు తాలిబన్లు ఆధిపత్యాన్ని చేపట్టి షరియా చట్టాలు అమలు లోకి వచ్చినప్పటికీ.. ఇస్లామిక్ పాలన కొనసాగుతున్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు మాత్రం ఆగకపోవడం తో గమనార్హం.

 ఇటీవల కాలంలో ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో వరుస గా బాంబు పేలుళ్లు జరుగుతూ ఉండటం కలకలం సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకు పలు మార్లు బాంబు పేలుళ్లు జరగ్గా.. ఐఎస్ఐఎస్ కె తీవ్ర వాదులు ఇక ఈ బాంబు పేలుళ్లకు తామే బాధ్యులము అంటూ ప్రకటించారు  ఇక పోతే ఇటీవలే కాబూల్లోని మసీదు లో మరో సారి బాంబు పేలుడు జరిగింది   ఈ ఘటన లో 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ బాంబు పేలుడు కి ఎవరు బాధ్యులు అనే విషయం మాత్రం ఇప్పటివరకు ఎవరు ప్రకటించక పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: