రేవంత్ వార్ : వైట్ ఛాలెంజ్ మంచిదేనా?

RATNA KISHORE
రేవంత్ వార్ : వైట్ ఛాలెంజ్ మంచిదేనా?
 డ్ర‌గ్ కేసులో ఎవ‌రి పాత్ర ఎంత‌న్న‌ది తేల్చే ప్ర‌య‌త్నం ఈడీ క‌న్నా రేవంత్ రెడ్డే ఎక్కువ‌గా చేస్తున్నాడు. ఈ కేసులో అన్ని రాజ‌కీయా పార్టీల‌ను ప్ర‌తివాదులుగా చేర్చిపోతున్నాడు. రేవంత్ ఫైల్ చేసిన ప‌బ్లిక్ ఛార్జిషిట్ లో  సొంత సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. ఈ క్ర‌మంలో కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి జాబితాలోకి వ‌చ్చారు. రేవంత్ ఛాలెంజ్ ను అందుకున్నారు. ఇక కేటీఆర్ మాత్రం మేం వేరు మా స్థాయి వేరు అని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అవేంటంటే...
ఎన్నిక‌ల్లో ప్ర‌తి లీడ‌ర్ డ్ర‌గ్ టెస్ట్ ను చేయించుకోవాలి అలా అయితేనే వారిని పోటీకి అనుమ‌తించాలి అని చెబుతున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. ఆయ‌న మాట‌ల‌తో మొత్తం తెలంగాణ‌నే కాదు యావ‌త్ దేశ‌మే ఉలిక్కి ప‌డేలా ఉంది. మ‌రోవైపు వైట్ ఛాలెంజ్ అంటూ రేవంత్ తెగ హ‌డావుడి చేస్తున్నారు. గ‌న్ పార్క్ అమ‌రుల స్థూపం ద‌గ్గ‌ర ఇవాళ నాట‌కీయ ప‌రిణామాలు నెల‌కొ న్నాయి. రేవంత్ రెడ్డి విసిరిన స‌వాలును స్వీక‌రించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి తాను డ్ర‌గ్స్ తీసుకోన‌ని, త‌న శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధ‌మేన‌ని చెప్పి, గ‌న్ పార్క్ కు వ‌చ్చారు. ఇదే దిశ‌లో కేటీఆర్ కూడా వ‌స్తే ఎంతో బాగుండున‌ని కూడా అన్నారు. రాజ‌కీయంలో పెద్ద‌వాళ్లు, చిన్న‌వాళ్లు ఉండ‌ర‌ని, మా స్థాయి వేరు అని మాట్లాడ‌వ‌ద్ద‌ని కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి హిత‌వు చెబుతూ, పెద్ద‌వాళ్లు ఎవ్వ‌ర‌యినా స‌రే చిన్న‌వాళ్ల ద‌గ్గ‌రికే వెళ్లి మాట్లాడి వ‌స్తార‌ని అన్నారు.

అదేవిధంగా సింగ‌రేణి కాల‌నీ కేసులో కూడా డ్ర‌గ్ వాడ‌కం ఉంద‌ని తెలిపారు. డ్ర‌గ్ వాడకం కార‌ణం గానే చిన్నారి చైత్ర‌ను నిందితు డు రాజు అమానుషంగా చంపేశాడ‌ని తెలిపారు. ఇదే సంద‌ర్భంలో బండి సంజయ్ కు , ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కు తాను స‌వాలు విసురుతు న్నానని, వారి ద్ద‌రూ తాను ఇచ్చిన వైట్ ఛాలెంజ్ స్వీక‌రించి, తాము సచ్ఛీలుర‌మ‌ని నిరూపించుకోవాల‌ని డిమాండ్ చేశారు.
ఏదేమైన‌ప్ప‌టికీ..
సినిమా వాళ్ల‌ను క‌దిపి కుదిపేస్తున్న డ్ర‌గ్ వివాదం రాజకీయ రంగం వైపు తిరిగింది. దీంతో రాజ‌కీయాలు మ‌రింత‌గా వేడెక్కాయి. రేవంత్ ఇదే విష‌య‌మై దూకుడు పెంచారు. త‌న‌వాళ్ల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం కేటీఆర్ చేస్తున్నార‌ని ఆరోపిస్తూ, కేటీఆర్ డ్ర‌గ్స్ తీసుకోకుంటే తాను పిలిచిన విధంగా గ‌న్ పార్క్ కు వ‌చ్చేవాడే అని అన్నారు. ఇదే సంద‌ర్భంగా నాయ‌కులు ఎవ్వ‌రైనా త‌మ స‌చ్ఛీల‌త నిరూపించుకోవాల‌ని స‌వాల్  చేశారు. దీంతో హైద్రాబాద్ కేంద్రంగా డ్ర‌గ్ వివాదం మ‌రింత‌గా తీవ్రం అయింది. మ‌రోవైపు సినిమా వాళ్ల‌కు క్లిన్ చిట్ ఇస్తుంటే.. ఇక్క‌డ మాత్రం ఎవ‌రికి వారు త‌మ‌ని తాము బెస్ట్ ప‌ర్స‌న్స్ గా వ‌ర్ణించుకుంటున్నారు. ఇవాళ వివాదంలో భాగంగా గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర‌కి భారీగా చేరిన కాంగ్రెస్ శ్రేణుల వ‌ద్ద‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి కూడా వ‌చ్చి చేసిన వ్యాఖ్య‌లు అటు బీజేపీలోనూ ఇటు బీఎస్పీలోనూ క‌ల‌వ‌రం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: