బ్రేకింగ్:టీడీపీ అగ్ర నేతపై అట్రాసిటి కేసు...?

Gullapally Rajesh
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో వివాదంగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యల విషయంలో టీడీపీ సీనియర్ నేతలు ఆయనకు అండగా నిలిస్తే వైసీపీ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్  మాజీ సిఎం చంద్రబాబు ఇంటిపై దాడికి దిగారు. అక్కడి నుంచి కూడా పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. తాజాగా ఆయనపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మాట్లాడుతూ ఫైర్ అయ్యారు.
గుంటూరు రూరల్ ఎస్పీ ని కలిసిని వైసిపి ఎమ్మెల్యే లు మేరుగ నాగార్జున, మద్గాలి, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పి రెడ్డి, మేయర్ కావటి మనోహార్ మీడియాతో మాట్లాడారు. కోడెల వర్దంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి ఫిర్యాదు చేసామని వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. అయ్యన్నపాత్రుడు మానవ మృగం, బలిసిన అడ్డగాడిద లా మాట్లాడాడు అని విమర్శించారు. అయ్యన్న వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం, పోలీసులపై రాజ్యాంగ వ్యవస్థ పై నీచంగా మాట్లాడారు అన్నారు.
దళిత మహిళా హోం మంత్రి ని కించ పరిచేలా మాట్లాడారు అని ఈ సందర్భంగా కామెంట్స్ చేసారు. అయ్యన్నపాత్రుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అని డిమాండ్ చేసారు. దళితులు, మైనారిటీ అంటే టిడిపి కి చిన్నచూపు అన్నారు ఆయన. కులాలు, మతాలను, ప్రాంతాలను రెచ్చగొట్టేలా టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. జగన్ సంక్షేమ పాలన తో టిడిపి కూసాలు కదిలిపోతున్నాయి అన్నారు. అయ్యన్నపాత్రుడును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. నర్సీపట్నం లో అయ్యన్న అక్రమ వ్యాపారాలు అన్ని బయట పెడతాం అని సవాల్ చేసారు ఎమ్మెల్యే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: