పాపం; తెలంగాణా బిజెపి చెప్పుకోలేని కష్టాలు...?

Gullapally Rajesh
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ప్రచారం చేసే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఏంటి అనేది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది కీలక నాయకులు సమర్థవంతంగా పనిచేయాలసి ఉన్న నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో కాస్త బిజెపి జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని సిద్ధమవుతుందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్వారా తెలంగాణలో సంచలనం సృష్టించారు.
దీనితో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది చర్చనీయాంశం అయిన అంశం. ఇటీవలి కాలంలో అవినీతి విషయంలో విపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో బిజెపి నేతలు సమర్థవంతంగా ఆరోపణలు చేయలేకపోతున్నారని ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరహాలో ప్రజల్లోకి వెళ్లే విధంగా బిజెపి రాష్ట్ర నాయకత్వం మాట్లాడలేకపోతున్నది అని జాతీయ నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. పాదయాత్రలో కూడా దళిత బంధు విషయంలో బండి సంజయ్ పెద్దగా స్పందించే ప్రయత్నం చేయలేకపోతున్నారు.
దీని వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. కొంతమంది కీలక నాయకులు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండటం ప్రధానం సమస్యగా మారిన అంశం. అదే విధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆకర్షించే విషయంలో ముందు ఆసక్తి చూపించినా తర్వాత మాత్రం పెద్దగా ముందుకు వెళ్ళలేక పోవడంతో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్షేత్ర స్థాయి నాయకత్వం నీ దగ్గర చేసుకునే విషయంలో కూడా బిజెపి స్థానిక నాయకత్వం పెద్దగా సఫలం కాకపోవడం అదేవిధంగా ఉద్యమ నాయకులను దగ్గర చేసుకునే విషయంలో కూడా హుజురాబాద్ ప్రాంత నాయకులు సమర్ధవంతంగా వ్యవహరించ లేకపోవడం అలాగే మంత్రి గంగుల కమలాకర్ విషయంలో దూకుడుగా వెళ్లకపోవడం ఇబ్బందిగా మారాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం హుజురాబాద్ కు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బండి సంజయ్ పాదయాత్రను పర్యవేక్షించడానికి కమిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: