తెలంగాణ : నిన్న ప్రాంతీయం .. నేడు కులం ..

Chandrasekhar Reddy
హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలలో వేడిపుట్టిస్తుంది. ఎన్నిక వాయిదా వేసినా కూడా పార్టీలు మాత్రం ప్రచారంలో వెనక్కి తగ్గడంలేదు. అయితే గతంలో ఎన్నికల సమయంలో ప్రచారం ప్రాంతియతను రెచ్చగొట్టి ఓట్లు దండుకొనే రీతిలో ఉండేది. ఇప్పుడు హుజురాబాద్ లో కాస్త మారింది, ప్రాంతియత ప్రత్యర్థులకు లాభిస్తుందని కులాన్ని తెరపైకి తెచ్చారు. దాని కోసం దళితబందు పథకం హడావుడిగా తెచ్చేసింది అధికార  పార్టీ. తాజాగా కేటీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం రోజులను గుర్తు చేసి మళ్ళీ ప్రాంతీయతను వాడుకోవాలని ప్రయత్నించాడు.
తెలంగాణ ఆవిర్భావం నుండి నేటి వరకు అభివృద్ధి పేరుతో కుటుంబ పాలన జరిగింది, ఆ కుటుంబం ఎన్నో ఆస్తులను పోగుచేసుకుంది. సాధారణంగా పోటీ లేని రాజ్యం కాబట్టి రాష్ట్రాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశం నాయకత్వానికి ఉంది. కానీ అవేమి పట్టకుండా పోటీ లేదులే అనుకుంటూ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోయారు. విపరీతంగా బడ్జెట్ పెంచుకుంటూ పోతూ రాష్ట్రాన్ని అప్పులపాలు  చేశారు. ఉమ్మడిగా ఉన్నప్పుడే సరిపోయిన లక్ష కోట్ల బడ్జెట్ వీళ్లు రాగానే రెండున్నర లక్షలు దాటిందంటేనే పరిపాలన ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఒక్క లక్ష కోట్లతో ఉమ్మడి తెలుగు రాష్ట్రం సజావుగా సాగినప్పుడు రెండున్నర లక్షల కోట్లు కూడా ఒక్కో తెలుగు రాష్ట్రానికి సరిపోవడం లేదంటే పాలకులను అనుమానించాల్సిందే.
ఎన్నో కలలతో సాధించుకున్న తెలంగాణ ప్రాంతీయ, కుల రాజకీయాలతో ప్రస్తుతం ఉడికిపోతుండటం ఎందరో ఉద్యమ కారులను క్షోభకు గురిచేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం గా తాజాగా బీజేపీ తయారవుతుండటంతో మరోసారి ఇదే తరహా రాజకీయాలు వెలుగుచూస్తున్నాం. అంతే తప్ప ఇప్పటివరకు రాష్ట్రాన్ని ప్రజల ఆశల మేరకు తీర్చిదిద్దడం మాత్రం అధికారంలో ఉన్నవారికి చేతకాకపోవడం శోచనీయం. ఇన్ని జరుగుతున్నా ప్రజలు కూడా ఎన్నికల సమయంలో ప్రాంతీయతకు ఓటు వేస్తున్నారు తప్ప, మంచి నేతలను ఎన్నుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని లేదు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఏర్పాటైంది తప్ప ప్రజల కోసం కాదని స్పష్టం అవుతుంది. తాజా హుజురాబాద్ ఎన్నికలలో కూడా కులరాజకీయం కోసమే దళితబందు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎలాగైనా గెలవాలని ఇష్టానికి పథకం పేరుమీద ఖర్చు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: