నకిలీ చలాన్ల వ్యవహారంతో ఏపీ ఖజానాకు భారీ గండి ?

Veldandi Saikiran
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో నకిలీ చలాన్ల వ్యవహారం పై పెద్ద దుమారం లేపిన సంగతి విధితమే.  ఈ నకిలీ చలాన్ల వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్నే కాదు...  తెలంగాణ రాష్ట్రంలోనూ కలకలం రేపుతోంది.  అయితే.. తాజాగా ఈ నకిలీ చలాన్ల వ్యవహారం పై  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.   రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల వ్యవహారం పై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తెలుగు దేశం పార్టీ  హయాం లో సీఎఫ్ ఎమ్ ఎస్ తప్పుడు తడకలు గా రూపొందించటం వల్లే అక్రమా లకు ఆస్కారమైందని  ఆరోపణలు చేశారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్.  

తప్పుడు చలాన్ల వల్ల  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఏకం గా 9 కోట్ల 26 లక్షల 92 వేల 577 రూపాయల  నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు 5 కోట్ల 8 లక్షల 65 వేల 606 రూపాయలు తిరిగి రాబట్టామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు.  ఇంకా 4 కోట్ల 18 లక్షల 26 వేల 971 రూపాయలు రాబట్టాల్సి ఉందని తేల్చి చెప్పారు.  ఇక 11  రెవెన్యూ జిల్లాల పరిధి లో 41 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో  తప్పుడు చలాన్లు గుర్తించామని వివరించారు.  

ప్రాధమిక సమాచారం మేరకు కొందరి పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ స్పష్టం చేశారు.  ఇప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులపై 44 కేసులను నమోదు చేశామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్.... మరో  29 మంది పై  శాఖా పరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అలాగే... మరో 9 మంది సబ్ రిజిస్ట్రార్ల ను విధుల నుంచి తప్పించామన్నారు.  ఈ నకిలీ చలాన్ల వ్యవహారం లో ఎంతటి వారి ప్రమేయమున్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: