జపాన్ లో కొత్త ట్రెండ్.. ఫ్రెండ్షిప్ మ్యారేజ్?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. పాతికేళ్ల ప్రాయంలో ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి తోడు నీడను వెతుక్కోవడమే పెళ్లి. ఈ క్రమంలోనే ఆ తోడుతోనే సంతోషంగా ఉంటాము అనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా వైవాహిక బంధం లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే యువతి యువకులు అందరూ కూడా పెళ్లిపై కోటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో మాత్రం పెళ్లి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పెరిగిపోతున్న జీవన వ్యయం ఇలా అందరిలో భయాన్ని కలిగిస్తుంది.

 పెళ్లి చేసుకొని ఇక పిల్లలను బాగా చదివించి వారి బాధ్యతలు ఖర్చులు చూసుకోవడం అంటే అమ్మో తలకు మించిన భారం అవుతుంది అని ఎంతోమంది యువతి యువకులు అనుకుంటున్నారు. అందుకే ఇక 30 ఏళ్లు దాటి పోతున్న కూడా ఇంకా పెళ్లి అని ఆలోచన చేయడం లేదు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. కొన్ని దేశాల్లో అయితే పెళ్లి మాట ఎత్తితేనే భయపడుతున్నారు. రిలేషన్ షిప్స్ కొనసాగిస్తున్నారు తప్ప.. పెళ్లి జోలికి మాత్రం అస్సలు వెళ్లడం లేదు. ఇంకొంతమంది పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడానికి సరికొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. జపాన్ లో అయితే పెళ్లి విషయంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది అన్నది తెలుస్తుంది.

 బాధ్యతతో కూడిన వివాహ బంధాలకు జపాన్ యువత ఎక్కడ మొగ్గు చూపడం లేదు. దీంతో ప్రేమ లైంగిక సంబంధాలకు తావు లేకుండా ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అని కొత్త కాన్సెప్ట్ ను తెరమీదకి తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు అక్కడ యువత మొత్తం ఇదే ట్రెండ్  ఫాలో అవుతోంది. పరస్పర ఇష్టాలు విలువల ఆధారంగా వారు జీవిస్తారు. కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కంటారు. దేశంలో 500 మంది ఇలాంటి బంధంతోనే ఒకటయ్యారని.. కొలోరస్ అనే జపాన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెళ్లడం అయింది. ఆర్థిక ఉద్యోగపరమైన సవాళ్ల నేపథ్యంలోనే ఇక ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారట జపాన్ యువత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: