జనం కోసం పవన్ : చంద్రబాబునీ దారి తెచ్చాడే !

RATNA KISHORE
క్రానిక్ కిడ్నీ డిసీజెస్ తో సతమతమవుతున్న ఉద్దానం ప్రాంతంకు తన వంతు సాయం అందించే క్రమాన ఇక్కడి వారి పక్షాన పోరాడడడంతోనే పవన్ ఏంటన్నది తేలిపోయింది. ఆయన పర్యటన తరువాత చంద్రబాబు రక్షిత మంచి నీటి ఏర్పాటుతో పాటు,పింఛన్ల మంజూరుకు ప్రాధాన్యం ఇచ్చారు. బాధితులు విశాఖకు వెళ్లి డయాలసిస్ చేయించుకునేందుకు వీలుగా వారికి బస్ పాస్ సౌకర్యం కల్పించారు. తన వంతుగా పవన్ బాధితులను ఆదుకో వడమే కాకుండా, ఇక్కడి ప్రాంతాలలో వైద్య నిపుణులతో చర్చించి సమస్య పరిష్కారార్థం ఏం చేయాలో అన్న విషయమై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఉద్దానం సమస్యపై అప్పటికే అవగాహన ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నిపుణులతోనూ పవన్ మాట్లాడారు.


ఆ విధంగా ఆ రోజు ఇచ్చిన సబ్జెక్టివ్ ఫోకస్ తరువాత కాలంలో ఎంతో ప్రభావితం చేసింది. ఇప్పుడు జగన్ పలాస కేంద్రంగా వంద కోట్లతో ఓ ప్రత్యేక ఆస్పత్రి కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసమే కడుతున్నారంటే అదంతా పవన్ ఎఫెక్టే! అంతేకాదు అధికారంలోకి వచ్చాక ఉద్దానం ప్రాంత సమస్యలపై పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని తనవంతు బాధ్యతగా పనిచేసేందుకు జగన్ ప్రకటన చేయడమే కాదు ఈ ప్రాంత ప్రజలకు ఆర్థిక భరోసా కూడా కల్పించేందుకు సిద్ధమని చెప్పారంటే అది కూడా పవన్ ప్రభావమే! ఆ రోజు ఆయన ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఆలోచన రాగానే జగన్ అప్రమత్తం అయిపోయారు. అలా ఏక కాలంలో ఇద్దరు ముఖ్య నేతలను ఆలో చింపజేయగలిగా రు. కదిలించగలిగారు. తిత్లీ సమయంలో తనవంతు బాధ్యతగా భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. హుద్ హుద్ సమయంలోనూ ఇదే విధంగా స్పందించారు. తీవ్ర తుఫానులు రెండూ టీడీపీ హయాంలో వ చ్చినవే..వీటికి అతలాకుతలం అయింది మా ఉత్తరాంధ్ర ప్రాంతమే! ఆయా సందర్భాల్లో పవన్ అభిమానులు మారుమూల ప్రాంతాలకు పోయి సాయం చేసి వచ్చారు. అంతేకాదు అక్కడి సమస్యలను టీడీపీ సర్కారు దృష్టికి తెచ్చి అధికారులలో కదలిక తెచ్చారు.

కాస్త ప్రజా సమస్యలపై దృష్టి సారించే ప్రతిపక్షానికీ జగన్ కూ అన్నింటికీ ఏకతాటిపై తెచ్చి మాట్లాడించే సత్తా పవన్ కు ఉంది. ఈ రం గంలో స్థిరపడిన రాజకీయ నాయకులకు విభిన్నంగా కాస్తయినా హుందాగా మాట్లాడే లక్షణం పవన్ కు ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలపై గొప్ప ప్రేమ ఉంది. ఇక్కడి సమస్యలపై చలించి పోయే లక్షణం ఉండడంతోనే ఉద్దానంపై స్పందించాడు. ఇక్కడికి వచ్చి పర్యటించా డు. బాధితులకు భరోసా ఇచ్చాడు. ఇచ్ఛాపు  రంలో వారితో మాట్లాడాడు. సమస్య పరిష్కారార్థం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ క ళాశాల మైదానంలో ఒక రోజు దీక్ష చేశాడు. ఈ ప్రాంతం ప్రజలకు తానెన్నడూ అండగా ఉంటానని రెండు తీవ్ర తుఫానుల సమ యం లో ప్రభుత్వాలకు దీటుగా పవన్ సేన కదలింది అంటే అందుకు కారణం ఆపద సమయాల్లో తనవంతు బాధ్యత నిర్వర్తించేందుకు ప్రాధాన్యం ఇవ్వడమే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: