తెలంగాణాలో మరో ఎన్కౌంటర్...? రేప్ నిందితుడికి దిశా తరహా శిక్ష...?

Gullapally Rajesh
ఇటీవల సైదాబాద్ లో జరిగిన చిన్నారి అత్యాచారం ఘటనకు సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. హత్యాచారం నిందితున్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. బలసినోడికి ఓ న్యాయం చేస్తున్నారు,గిరిజనులకు న్యాయం జరగడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేశారు అని గుర్తు చేసారు. ఈ ఘటన పై ఇప్పటి కి మంత్రులు స్పందించలేదు అన్నారు.
గంజాయ్ మత్తులో ఒక దుర్మార్గుడు ... చిన్నారిని హత్యచారం చేశాడు అని ప్రభుత్వం లో ఉన్నవారు మనుషులేనా అని ప్రశ్నించారు. మానవత్వం ఉందా అని నిలదీశారు. ఇది దుర్మగమైన చర్య అన్నారు ఆయన. దిశ సంఘటన జరిగినపుడు ఏం చేసారో ఇప్పుడు కూడా అలాగే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేసారు. కమిషనర్ చవట దద్దమ్మ అన్నారు ఆయన. కల్లు కంపౌండ్ దగ్గర పని చేయడానికి పనికి రాడు అని ఆరోపించారు. కమిషనర్ కు కామన్ సెన్స్ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇప్పటి వరకు చర్య లు తీసుకోలేదు అని ఆయన విమర్శించారు. నిందితుడిని అరెస్టు చేయలేదు అన్నారు. ఇక్కడ గంజాయ్ నడుస్తున్న పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఆదాయం పెరగడానికి మద్యం అమ్మకాలు చేస్తున్నారు అని విమర్శించారు. మద్యం అమ్మకాలు,గంజాయ్ అమ్మకం తో ఇటు వంటి దారుణాలు జరుగుతున్నాయి అన్నారు. హోంమంత్రి మంత్రికి సిగ్గు లేదు అని ఆరోపించారు. పక్కన హత్య చారం జరిగితే ఇప్పటి వరకు స్పందించలేదు అన్నారు. దత్తత తీసుకున్న ఈ సింగరేణి కాలనీ ని ఎందుకు సందర్శించడం లేదు అని నిలదీశారు. డ్రగ్స్ బ్రాడ్ అంబాసిడర్ గా కేటీఆర్ ఉంటే మద్యానికి బ్రాడ్ అంబాసిడర్ గా కెసిఆర్ ఉన్నాడు అని సంచలన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: