హుజురాబాద్ ప్రచారానికి మూడు సార్లు అమిత్ షా.. !!

Veldandi Saikiran
కేంద్ర హోమ్ శాఖ మంత్రి  అమిత్ షా హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి మూడు సార్లు వస్తారని.. త్వరలోనే అమిత్ షా పర్యటనకు సంబందించిన షెడ్యూలు త్వరలోనే చెబుతామని తెలంగాణ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.  హుజురాబాద్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసే అవకాశం ఉందని.. టీ ఆర్ ఎస్ ,కాంగ్రెస్ కలిసి బీజేపీ పై అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.  హుజురాబాద్ లో  ఓడి పోతుందని సీఎం కెసిఆర్  ఢిల్లీ వెళ్లాడని ఎద్దేవా చేశారు.  

నిర్మల్ అమిత్ షా సభ కి మూడు లక్షలు వచ్చేలా శ్రేణులు పని చేయాలని పిలుపు నిచ్చారు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  కేంద్ర నాయకత్వం పూర్తి సహాయం అందిస్తుందని.. హుజురాబాద్ నియోజక వర్గం లో  గెలుపు బిజేపి  పార్టీకి అవసరమని స్పష్టం చేశారు.  ఎం ఐ ఏం గుండాలు బైంసా లో  విధ్యంసం సృష్టించారని నిప్పులు చెరిగారు.  ముఖ్యమంత్రి కెసిఆర్  మొండి వైఖరి తో , ఏం ఐ ఎం పార్టీ వ్యతిరేకిస్తుందని సెప్టెంబర్ 17 అధికారికం గా నిర్వహించడం లేదని పేర్కొన్నారు బండి సంజయ్.

హుజురాబాద్ లో బీజేపీ గెలుస్తుందని మోదీ మా వైపు ఉన్నట్టుగా డిల్లిలో చక్కర్లు కొట్టి వచ్చాడని.. అమరవీరుల ఆత్మ బలిదానాలు కేసీఆర్ విస్మరించారని నిప్పులు చెరిగారు బండి సంజయ్.  ఫామ్ హౌస్ ప్రగతి భవన్ తప్ప కేసీఆర్ రాష్టంలో పాలన పడకేసిందని.. కేసిఆర్ గడిలను కుటుంబ పాలనను బీజేపీ పార్టీ బద్దలు కొడుతోందని ఫైర్ అయ్యారు బండి సంజయ్. 2023 ఎన్నికలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 3లక్షల ఇళ్ళు కేటాయిస్తే  కేసీఆర్ ఇచ్చింది పన్నెండు వేలు అని తెలియ చేశారు.  బాబా సాహెబ్ అంబెడ్కర్ ను గౌరవించింది బీజేపీ పార్టీ..బాబా సాహెబ్ జయంతికి వర్ధంతులు కేసిఆర్ కు గుర్తుకు రావని నిప్పులు చెరిగారు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: