విజయసాయికి మంత్రి ఫుల్ సపోర్ట్... ఆయన చాలా మంచోడు...?

Gullapally Rajesh
టీడీపీ ఉత్తరాంధ్ర రక్షా వేదిక పెట్టడం పట్ల మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. టిడిపి ఉత్తరాంధ్ర రక్షణ చర్చ వేదిక పెట్టడం సంతోషం అని ఆయన హర్షం వ్యక్తం చేసారు. ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పెట్టారు అని అన్నారు. టిడిపి ఉత్తరాంధ్ర లోనే ఉందా? రాయలసీమ,కోస్తా లో ఆ పార్టీ లేదా? అని ఆయన నిలదీశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని జగన్ భావించారు అన్నారు అవంతి. ఉత్తరాంధ్ర పై చిత్తశుద్ధి ఉంటే.. టిడిపి నేతలు విశాఖపరిపాలన రాజధాని కావాలని తీర్మానం చేసి బాబుకు పంపాలి అని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.
అమరావతి పై దుష్ప్రచారం చేస్తున్నారు వారికి అన్యాయం జరగనివ్వం అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. టీడీపీ నేతలు పోలవరం, స్టీల్ ప్లాంట్, మోడీ పై ఒక్క మాట ఎందుకు మాట్లాడడం లేదు అని ఈ సందర్భంగా నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని అన్నారు. గంగవరం పోర్టు వలన గత 5 ఏళ్ళకు గానూ 80 కోట్లు మాత్రమే వచ్చాయి అని అన్నారు అవంతి. గంగవరం పోర్టు విషయంలో తమకు ఏ విధమైన దురాలోచన కూడా లేదు అని ఆయన స్పష్టం చేసారు.
టీడీపీ ఎమ్మెల్యే ఒకరు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశారు అన్న అవంతి శ్రీనివాస్ దానిపై టీడీపీ  వైఖరి ఏమిటి? అని ఈ సందర్భంగా నిలదీశారు. సింహాచలం భూములు పై అశోక్ గజపతి బాద్యతరహితగా మాట్లాడారు అని మండిపడ్డారు. అదే విధంగా విజయ సాయి రెడ్డి తో సహా వైసీపీ నేతలు ఎవరూ కూడా భూ కబ్జాలకు పాల్పడలేదు అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఆధారాలు ఉంటే చూపండి అంటూ అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: