మై గాడ్ :పిట్టల్లా రాలుతున్న జనం.. ప్లేట్ అన్నం 7500 - వాటర్ బాటిల్ 3000!
ఎందుకు మూర్ఛపోతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? కాబూల్ విమానాశ్రయం వెలుపల విదేశీ సైనికులు వారికీ ఎందుకు నీరు పోస్తున్నారు? . ఒక విదేశీ సైనికుడు ఈ ఆఫ్ఘన్ మహిళకు ఎందుకు నీళ్లు తాగేలా చేశాడు? ఈ ప్రశ్నలకు కారణం నీరు. ఆఫ్ఘన్ లో నీటి ధర ఆకాశాన్ని తాకుతోంది. కాబూల్ విమానాశ్రయం వెలుపల ఒక బాటిల్ వాటర్ $ 40 అంటే దాదాపు 3000 రూపాయలకు అమ్ముడవుతోంది. అదే సమయంలో, ఒక ప్లేట్ అన్నం ధర 100 డాలర్లకు పెరిగింది. అంటే దాదాపు 7500 రూపాయలు. పెద్ద విషయం ఏమిటంటే ఒక బాటిల్ వాటర్ కొనాలా లేక ఒక ప్లేట్ ఫుడ్ తీసుకోవాలా అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీకి బదులుగా, డాలర్లలో మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయి. ఆహారం మరియు నీటి ధరల పెరుగుదల కారణంగా, ప్రజలు ఆకలితో ఉన్న కడుపులతోనే ఆశగా ఎండలో నిలబడాల్సి వస్తుంది. దీంతో చాలా మంది అపస్మారక స్థితిలో పడిపోతున్నారు. కానీ ప్రజలకు సహాయం చేసే బదులు, తాలిబాన్లు వారిని కొడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో, నాటో దేశాల సైనికులు ఆఫ్ఘనిస్తాన్ సహాయకులుగా మారుతున్నారు. విమానాశ్రయానికి సమీపంలో తాత్కాలిక ఇళ్లు నిర్మించి అక్కడే నివసిస్తున్న ప్రజలకు తమకు వీలైనంతలో వాటర్ బాటిల్స్ ఆహారాన్ని అందిస్తున్నారు. ఇవి కాకుండా, అమెరికన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ చిన్న పిల్లలకు చిప్స్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.