కిషన్ రెడ్డి కలయిక... లెక్కేంటబ్బా?

Chaganti
ఈ రోజు విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 'జన ఆశీర్వాద' సభలో పాల్గొన్నారు. నిజానికి ఆయన 'జన ఆశీర్వాద యాత్ర' ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆయన జన ఆశీర్వాద యాత్రలో పాల్గొనడానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో జన ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి దానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పిలవడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి ఏమో అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సభకు హాజరైన కిషన్ రెడ్డి సభ కంటే ముందే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీకి కూడా అయినట్లుగా వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ కాసేపటికే అధికారికంగా కూడా ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి నివాసంలో జగన్ ను మర్యాదపూర్వకంగానే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి కలిశారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దంపతులను జగన్ వైయస్ భారతీ దంపతులు సన్మానించడం కూడా జరిగిందంటూ ప్రకటన వెలువడింది. 

అయితే ఈ కలయిక కేవలం మర్యాద పూర్వకంగా జరిగింది అని చెబుతున్నా సరే బిజెపి మద్దతు వైసీపీకి ఉంది అనే సంకేతాలు మాత్రం జనాల్లోకి వెళుతున్నాయి  అని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఒక రకంగా బీజేపీ మీద వైసిపి ద్వితీయశ్రేణి నాయకులు విరుచుకుపడుతున్నారు కానీ మంత్రులు ఆపై స్థాయిలో ఉన్న వారు ఎవరూ కూడా నేరుగా బీజేపీని కానీ, మోడీని కానీ విమర్శించిన దాఖలాలు లేవు.. గతంలో ఒకసారి మోడీ భార్య గురించి కొన్ని కామెంట్లు చేసిన కొడాలి నాని సైతం ఆ తరువాత అసలు మీడియా ముందుకు రావడానికి వెనకాడిన పరిస్థితి. బీజేపీ, వైసీపీ మధ్య మైత్రి బంధం లేదని చెప్పుకోవడానికి ఏపీ బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి నేరుగా జగన్ ఇంటికి వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: