హైద‌రాబాద్‌లో మొద‌లైన మ‌హావేలం.. ప్ర‌భుత్వానికి ఇక కాసుల పంట‌..!

Paloji Vinay
   మ‌హానగ‌రంలో ఉన్న కోకాపేట్‌, ఖానమెట్ట భూముల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వేళ కోకాపేట్ భుముల వేలంతో ప్ర‌భుత్వ ఖాజానాకు కాసుల వ‌ర్షం కుర‌య‌నుంది. నేడు కోకాపేట్ రేపు ఖాన‌మెట్టలో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను అధికారులు వేలం వేయ‌నున్నారు. దీంతో ప్ర‌భుత్వానికి దాదాపుగా 3,000 కోట్ల‌కు పైగా ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేశారు. నియోపొలిస్‌ పేరుతో హెచ్ఎండీఏ, ఎంఎస్‌టీఎస్ సంయుక్తంగా ఈ వేలం నిర్వ‌హించనుంది. మొత్తం 50 ఎక‌రాల‌ను 8 ప్లాట్లుగా విభ‌జించారు.
వేలానికి దేశ విదేశాల వివిధ కంపెనీల నుంచి 60 మందికి పైగా బిడ్డ‌ర్లు పాల్గొన‌నున్నారు. కోకాపేట్‌లోని భూముల‌కు ప్ర‌భుత్వం ఎక‌రానికి క‌నీస ధ‌ర 25 కోట్ల వ‌ర‌కు నిర్ణ‌యించింది. క‌రోనా లాక్‌డౌన్‌తో తెలంగాణ ప్ర‌భుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. దీంతో ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు  నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ఈ భూములు అమ్మాల‌ని నిర్ణ‌యించుకుంది. కానీ కొంద‌రు నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా కేసులు వేశారు. త‌రువాత హైకోర్టు అమ్మ‌కానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇవ్వాల వేలం నిర్వ‌హిస్తోంది.
 మ‌ఆన్‌లైన్ లో కోకాపేట్ భూములను విక్ర‌యించ‌నున్నారు అధికారులు. సౌత్ ఇండియాలోనే ఏ ప్ర‌భుత్వ భూములకు లేని రేటు కోకాపేట్‌, ఖానామెట్‌ల‌కు రావ‌డంతో రికార్డుల‌ను సృష్టిస్తోంది. గ‌తంలోను రాష్ట్ర ప్ర‌భుత్వం వేలం నిర్వ‌హించింది కానీ 14కోట్ల‌కు ఒక ఎక‌రం చొప్పున మాత్రం అమ్మారు. ఇప్పుడు ఇంత‌లా ధ‌ర ఉండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.  ఇంత‌కుముందు ఉప్ప‌ల్‌లో కూడా ప్ర‌భుత్వం ప్లాట్ల‌ను అమ్మింది.
 వేలంలో పాల్గొనాలంటే బిడ్డు దారులు 11వేలు క‌ట్టి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంతేయ కాకుండా వేలంలో పాల్గొనాలంటే 5 కోట్ల రూపాయ‌ల‌ను అడ్వాన్స్‌గా చెల్లించిన 60 మందిని మాత్ర‌మే వేలానికి అనుమ‌తించారు. గ‌తం నుంచే కోకాపేట్‌లోని భూముల‌కు అధిక ధ‌ర ఉంది. దీనికి కార‌ణం కోకాపేట్ గండిపేట చెరువు ప‌క్క‌న ఉండ‌డం, గ‌చ్చిబౌలిలోని ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ చేరువ‌గా ఉంది. అంతే కాదు. భ‌విష్య‌త్తులో మ‌రో బంజారా హిల్స్ గా మార‌నుంది. పెట్టుబ‌డుల‌కు అనువుగా కూడా ఈ భూములు అనువుగా ఉండ‌డం కూడా ఒక కార‌ణం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: