ఆ కమ్మ నేతలకు కొడాలిపై అంత ప్రేమ ఎందుకో?

M N Amaleswara rao

ఏపీ మంత్రివర్గంలో బాగా దూకుడుగా ఉండే మంత్రి ఎవరంటే? ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. జగన్ కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాని, టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించడంలో ముందుంటారు. నాని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుపై విరుచుకుపడుతూనే ఉన్నారు. తనదైన శైలిలో నాని పరుష పదజాలం వాడుతూ బాబుపై ఫైర్ అవుతారు.


రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూలేని విధంగా నాని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కొడాలి టార్గెట్ చంద్రబాబు మాత్రమే. అలాగే లోకేష్, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడులాంటి వారిపైనే నాని విరుచుకుపడతారు. ఎందుకంటే తమ సీఎం జగన్‌పై వీరే ఎక్కువగా విమర్శలు చేస్తారు. అందుకే వీరికే నాని కౌంటర్లు ఇస్తారు. మళ్ళీ వేరే టీడీపీ నాయకులని నాని పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు. అందులోనూ తన సొంత సామాజికవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులని నాని ఎప్పుడు విమర్శించలేదు.


చంద్రబాబు, దేవినేనిలు అదే కమ్మ వర్గానికి చెందిన నాయకులైన సరే వదిలిపెట్టరు. అలాగే టీడీపీలో ఉన్న కొందరు కమ్మ నేతలు కొడాలిపై విమర్శలు చేయరు. ఇటీవల నారా లోకేష్, జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక లోకేష్‌కు నాని ఏ స్థాయిలో కౌంటర్లు ఇచ్చారో అంతా చూశారు. అలాగే నానిపై కొందరు టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఊహించని స్థాయిలో బూతులు మాట్లాడారు.


కానీ టీడీపీలో ఉన్న కమ్మ వర్గానికి చెందిన కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, నెట్టెం రఘురాం, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జి‌వి ఆంజనేయులు, చింతమనేని ప్రభాకర్, గన్నీ వీరాంజనేయులు ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీలో ఉన్న చాలామంది కమ్మ నేతలు, నానికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అలాగే ఈ నేతలపై కొడాలి కూడా పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. మరి ఈ టీడీపీ కమ్మ నేతలకు కొడాలిపై అంత ప్రేమ ఎందుకో ఉందో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: