వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

Chaganti
ఎట్టకేలకు తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.. పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గురుమూర్తి దాదాపు రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిజానికి ఇక్కడ ఐదు లక్షల మెజారిటీ టార్గెట్ గా మంత్రులు ఎమ్మెల్యేలకు జగన్ పెట్టి పంపించారు. కానీ అనేక తంటాలు పడిన తర్వాత కూడా దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీ రావడమే గగనం అయిపోయింది. అయితే పోలింగ్ శాతం తగ్గడంతోపాటు కరోనా బీభత్సంగా ఉండడమే తమ మెజారిటీ తగ్గడానికి కారణం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే జగన్ నమ్ముకున్న వాళ్ళను పక్కన పెడుతున్న వైనం ఇక్కడ దాకా తీసుకు వచ్చింది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

నిజానికి జగన్ కష్టకాలంలో ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతగా ఉన్న పనబాక లక్ష్మి జగన్ కు అండగా నిలిచారు. కానీ ఆయన పనబాక లక్ష్మి పార్టీలోకి ఆహ్వానించింది లేదు. సరిగ్గా 2019 ఎన్నికల ముందు ఆమెను పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ఆమె అప్పుడే తిరుపతి టికెట్ కేటాయించారు. ఆ సమయంలో ఆమె ఓడిపోయారు తాజాగా కూడా మళ్లీ టీడీపీ తరఫున పోటీ చేసి 32 శాతం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది..

గురుమూర్తి అనే అభ్యర్థిని చివరి నిమిషంలో రంగంలోకి దింపితే 50 శాతం మాత్రమే వచ్చాయి అదే పనబాక లక్ష్మి లాగా ముందు నుంచి జగన్ కు కాస్త అండగా నిలబడిన వారికి రాజకీయ ప్రాధాన్యత ఉన్న వారికి ఈ టికెట్ కేటాయించి ఉంటే వైసీపీ క్యాడర్ ఇంకా ఆసక్తిగా మరింత దూకుడుగా పనిచేసి ఉండేవారని తద్వారా కచ్చితంగా ఇక్కడ పోలింగ్ శాతం పెరిగి కచ్చితంగా మెజారిటీ కూడా పెరిగి ఉండేది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. క్యాడర్ లో నెలకొన్న అభద్రతా భావమే ఈ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడానికి కారణం అనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: