ఏడాది త‌ర్వాత తెరుచుకున్న మ‌ర్క‌జ్‌... ఎందుకంటే..?‌

Spyder
ఏడాది త‌ర్వాత ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ బిల్డింగ్ తెరుచుకుంది. గ‌త ఏడాది క‌రోనా ఇక్క‌డి నుంచి ప్ర‌బ‌ల‌డంతో మ‌ర్క‌జ్ సంస్థ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మారుమోగింది. అనేక సార్లు మ‌ర్క‌జ్ అంశం ప్ర‌ధాన వార్త‌గా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఎట్ట‌కేలకు మ‌ళ్లీ ఈ సంస్థ ప్రార్థ‌నా మందిరం గేట్లు తెరుచుకున్నాయి. షాబ్ ఎ బారత్ ప్రార్థనల కోసం సుమారు ఒక సంవత్సరకాలం తర్వాత గరిష్టంగా 50 మంది విజిటర్స్‌కే అనుమతి కండీషన్‌తో ఈ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. గతేడాది మార్చిలో నిర్వహించిన తబ్లిగీ జమాత్‌‌లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని కేసు నమోదైన తర్వాత ఈ బిల్డింగ్‌ను మూసేశారు. ఈ పరిసర ప్రాంతాన్నీ కొవిడ్ హాట్‌స్పాట్‌గా పేర్కొన్నారు.

మర్కజ్‌ నిజాముద్దీన్‌ ఢిల్లీలోని ఓ మసీదు ప్రాంగణం. వందేళ్లుగా ఇస్లాం మత చైతన్యం కోసం పనిచేస్తున్న తబ్లిగీ జమాత్‌ అనే సంస్థకు అంతర్జాతీయ ప్రధాన కేంద్రం దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉంది. ఈ సం స్థకు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో విశ్వాసులు ఉన్నారు. ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో హరియాణాలోని మేవాట్‌ జిల్లాలో మౌలానా మహమ్మద్‌ ఇల్యాసీ అనే మత బోధకుడు 1926లో తబ్లిగీ జమాత్‌ను ఏర్పాటు చేశారు. హనఫీ సున్నీలకు చెందిన దియోబందీ విధానంలో భాగమిది. గ్రామాల్లోని తోటి ముస్లింలలో మత నిబద్ధతను పెం చేందుకు ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేసే కార్యకర్తలకు ఈ సంస్థ శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థను రష్యా సహా పలు దేశాలు నిషేధించాయి.

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు.భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 70వేలకు చేరువగా కొత్త కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 68వేల 020 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 291మంది కరోనాకు బలయ్యారు. మొత్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య కోటి 20లక్షలు దాటింది. మొత్తం మరణాల సంఖ్య 1,61,843కి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: