మీకు తెలుసా.. అది తింటే లైంగిక శక్తి పెరుగుతుందట..?

praveen
ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధునాతన జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతోమంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  ఈ క్రమంలోనే ఎంతో మంది లైంగిక సమస్యలతో కూడాబాధపడుతూ ఉన్నారు.  ముఖ్యంగా నేటి రోజుల్లో జీవనశైలి లైంగికసమస్యలు రావడానికి ప్రధాన కారణం గా మారిపోతుంది గంటల తరబడి ఒకేచోట కూర్చొని పని చేస్తూ ఉండటం..  పని ఒత్తిడి కారణంగా వ్యాయామానికి దూరం కావడం.. పౌష్టికాహారానికి కాకుండా హోటల్ లో దొరికే మసాలాలు దట్టించిన ఆహారాన్ని ఎక్కువగా అలవాటు పడిపోవడం లాంటివి జరుగుతున్నాయి.

 వెరసి ఎంతో మంది లైంగిక సామర్థ్యం తగ్గి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఎంతోమందిలో వీర్యకణాల సంఖ్య కూడా తగ్గి పిల్లలు పుట్టక ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా లైంగిక సామర్థ్యం పెరగాలంటే మునక్కాయ తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. నిపుణులు కూడా ఇదే విషయాన్ని సూచిస్తూ ఉంటారు. మునక్కాడ తినడం వల్ల లైంగిక వాంఛలు పెరుగుతాయని చెబుతూ ఉంటారు. అయితే కేవలం మునక్కాడ మాత్రమే కాదు సొరకాయ ఆనపకాయ తినడం వల్ల కూడా ఎంతో ప్రయోజనాలు ఉంటాయట.

 ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడుతున్న వారికి సొరకాయ ఆనపకాయ ఎంతో దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ ఆహారంలో సొరకాయను ఒక భాగం చేసుకోవడం వల్ల పురుషులలో వీర్యకణాల సంఖ్య కూడా బాగా పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు. సొరకాయ గింజలను బాగా వేపిన తర్వాత.. అందులో కొంచెం కారం జీలకర్ర ధనియాలు ఉప్పు వేసి కలపాలి. ఇక ఈ మిశ్రమాన్ని పేస్టులాగా చేసి అన్నంలో కలుపుకుని తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉందట. అంతేకాదు ఆనపకాయ కూర తో డీహైడ్రేషన్ జీర్ణ సమస్యను  కూడా దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: