మీడియా మంటలు: కరోనా ఉరుతున్నవేళ.. చంద్రజ్యోతీ.. ఏంటీ శవరాజకీయాలు..?

Chakravarthi Kalyan

కరోనా ఉరుముతోంది. రోజూ పదుల సంఖ్యలో  ఆంధ్రాలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. వందల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీడియా ముసుగులో శవరాజకీయం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రత్యేకంగా కరోనా మరణాలపై ఓ పత్రికలో  వస్తున్న కథనాలు శవరాజకీయాలకు అద్దం పడుతున్నాయి.  

 


ప్రత్యేకించి దమ్మున్న మీడియాగా  చెప్పుకునే ఓ పత్రికలో శవాల లెక్కలపై ప్రచురిస్తున్న ప్రత్యేక కథనాలు ప్రజలను విస్తుగొలుపుతున్నాయి. సదరు మీడియా ప్రతినిధులు.. శ్మశానాల దగ్గరకు వెళ్లి కాటి కాపరులను వాకబు చేస్తున్న తీరు.. అంబులెన్సుల డ్రైవర్లుతో కక్కిస్తున్న నిజాలు.. ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

 


తీరా ఇంతా చేస్తే.. ఏపీలో ప్రభుత్వం చెబుతున్న కరోనా చావుల లెక్కలకూ.. సదరు పత్రిక చేసిన ప్రత్యేక పరిశోధనాత్మక వీర, వీరోచిత జర్నలిజంతో తేల్చిన పెద్ద తేడా ఏమీ లేదు.. ఉంటే గింటే ఒక్కో జిల్లాలో ఓ నాలుగైదు శవాల లెక్కలు తేడా వచ్చి ఉండవచ్చు.  అయినా అధికారులు తమ రికార్డుల్లో చెప్పే లెక్కలకూ... ఊరూ పేరూ లేకుండా  కాటి కాపరులు చెప్పారు.. అంబులెన్సు డ్రైవర్లు చెప్పారూ అంటూ చెబుతున్న కాకి లెక్కలకూ పొంతన ఏంటీ..? 

 

 

పోనీ నిజంగానే జిల్లాకో పది శవాల లెక్కల తక్కువ వచ్చాయి అనుకుందాం.. అదేమైనా దేశ ద్రోహమా..  నోటి లెక్కలకూ రికార్డుల లెక్కలకూ ఆ మాత్రం తేడా ఏమైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావించొచ్చా.. అయినా ఈ శవాల లెక్కలతో సదరు పత్రిక ఏం చెప్పదలుచుకుంది..? అసలు ఈ సమయంలో చేయాల్సింది ఇలాంటి జర్నలిజమేనా... ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించడమో.. కరోనా విజయగాధలకు ప్రాధాన్యం ఇవ్వడమో చేయకుండా.. అదిగో.. శవాల లెక్కల్లో తేడా వచ్చేసింది.. ఈ జగన్ సర్కారు వేస్టు.. అంటూ చెప్పడం.. తమకు అనుకూల పార్టీలకు ఏమైనా మేలు చేకూరుస్తుందా.. ఏమో.. ఆ పత్రికకే తెలియాలి.?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: