కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను నిరోధించవచ్చట.. ఈ విషయం తెలియక జనం చస్తున్నారే.. ??

venugopal

ప్రపంచంలో ఆకలికంటే భయంకరమైనది ఏది లేదని ఇన్నాళ్లూ జనం అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆకలి కంటే దారుణం కరోనా అని ముచ్చటించుకుంటున్నారట. ఆకలి వేస్తే నీరు తాగుతూ అయినా, ఆహారం దొరికే వరకు బ్రతకవచ్చూ, కానీ కరోనా వస్తే బ్రతుక్కే అర్ధం మారిపోతుందనే భయం చాలా మందిని నిదురకు దూరం చేస్తుందట..

 

 

లోకంలో చాలా మంది, కరోనా వచ్చిన మొదట్లో, ఈ వైరస్‌ను తేలికగా తీసుకున్నారు..  కానీ ఇది దేశాలు దాటి, నగరాలు దాటి, పల్లెలు దాటి, ప్రతి గడపలో పాతుకు పోతుంది. చూపుకు కనిపించని ఈ చిన్నది పనితనంలో మాత్రం గొప్పదని నిరూపించుకుంది.. ఇక దీని అంతు చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలు అపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా అంతానికి దారులు దొరికాయని చెబుతున్నారు గానీ, ఓ కొలిక్కి వచ్చిన దాఖలు లేవు..

 

 

ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను కనిపెట్టి, క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నామని ప్రకటించగా, మనదేశంలో కూడా వ్యాక్సిన్ వచ్చింది కానీ, ఇంకా అందుబాటులోకి రాలేదు అనే ప్రచారం జరుగుతుంది.. ఇలాంటి సమయంలో కరోనా రోగుల బ్రతుకుల్లో చిన్న ఆశ చిగురింపచేసే వార్తను "స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా" మోసుకొచ్చింది.. కరోనా వైరస్ నివారణకు ‘కోల్డ్‌జైమ్’ అనే మౌత్‌ స్ప్రేను కనుగొన్నామని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మౌత్ స్ప్రే కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను 98.3 శాతం అంతమొందిస్తుందని, ఎంజైమాటికా కంపెనీ పేర్కొంటుంది.. తమ ప్రాథమిక ఫలితాల్లో ఈ మౌత్ స్ప్రే కరోనాకు కారణమైన సార్స్‌-కోవ్‌2  అనే వైరస్‌ను నాశనం చేయడాన్ని తాము గుర్తించామని వీరు అంటున్నారు..

 

 

ఈ విషయమై ఎంజైమాటికా సీఈఓ క్లాజ్ ఎగ్‌స్ట్రాండ్ మాట్లాడుతూ. అమెరికాకు చెందిన మైక్రోబాక్ లాబొరేటరీస్ ద్వారా ఇంటర్నేషనల్ టెస్ట్ మెథడ్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్‌లను నిరోధించడంలో, మా మౌత్ స్ప్రే ప్రభావవంతంగా పనిచేసినట్టుగా ఫలితాలు సూచించాయని ఆయన అంటున్నారు.. ఇదే కాకుండా గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్సిన్లతో కూడిన, సొల్యూషన్‌తో కోల్డ్‌జైమ్‌ను ఉపయోగించి, వైరసిడల్ ఎఫికసీ సస్పెన్షన్ అనే పరీక్ష జరిగిందట. ఇందులో ఉండే కోల్డ్‌జైమ్‌ను నోరు, గొంతు లోపలికి  స్ప్రే చేస్తే ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడమే గాక, వైరస్‌ వ్యాప్తిని కూడా బాగా తగ్గిస్తుందని క్లాజ్ తెలిపారు.

 

 

చూశారా ఇలా ఎందరు ప్రజలకు ఆశ కలిపిస్తున్నా, ముందుగా కరోనాకు మందు వచ్చి, దాన్ని వాడిన రోగులు ఆరోగ్యంగా కోలుకుంటే గానీ మనశాంతి కలుగదు.. అంతవరకు ఇలాంటి వార్తలు నాన్ స్టాప్‌గా వస్తూనే ఉంటాయని ఇలాంటి ప్రకటనలు చూసిన వారు భావిస్తున్నారట.. ఒక విధంగా ఇది చాలా మంచి న్యూస్.. ఇదేగనుక మార్కెట్లోకి వస్తే ఎందరో పేదప్రజలను కాపాడిన వారు అవడమే కాదు.. దోపిడీకి అడ్డుకట్ట వేసిన వారు అవుతారు.. కానీ ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఈ సంస్ద వారు తెలుపలేదు.. బ్యాడ్‌లక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: