పొలిటికల్ స్క్రీన్‌పైకి సడన్ ఎంట్రీ ఇచ్చిన ఆ రెడ్డి నేత వారసుడు

M N Amaleswara rao

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి చాలామంది సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని, తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్న విషయం తెలిసిందే. అయితే అలా టికెట్లు దక్కించుకున్న ఒక్క వారసుడు కూడా జగన్ గాలిలో గెలవలేదు. అందరూ ఓటమి పాలయ్యారు. దీంతో ఓటమి దెబ్బకు చాలామంది వారసులు ఒక్కసారిగా ఏపీ పోలిటికల్ స్క్రీన్ మీద మాయమైపోయారు. అలా మాయమైపోయిన వారసుల్లో టీడీపీ సీనియర్ నేత gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసుడు సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు.

 

శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన సుధీర్, వైసీపీ అభ్యర్ధి మధుసూదన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి  నియోజకవర్గంలో కనిపించలేదు. అయితే అప్పటినుంచి కనబడని సుధీర్, ఇటీవల నారా లోకేశ్ యువనేతలకు ఇచ్చిన విందులో బయటపడ్డారు. మరి ఆ విందులో ఏం జరిగిందో, ఏమో తెలియదుగానీ, అప్పటి నుంచి యువ నాయకులు యాక్టివ్ కావడం మొదలుపెట్టారు.

 

పైగా స్థానిక సంస్థల్లో పార్టీని గెలిపించుకోవడానికి కష్టపడుతున్నారు. ఇటు సుధీర్ కూడా ఎన్నికల తర్వాత శ్రీకాళహస్తి పోలిటికల్ స్క్రీన్‌పై సడన్ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న తమ బలం తగ్గలేదని నిరూపించాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే సుధీర్ ఎక్కువ హడావిడి చేయకుండా, సాదాసీదాగా ఉంటున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు ఏమన్నా పూల దండాలు, శాలువాలు తెచ్చి హడావిడి చేస్తే, మొహమాటం లేకుండా వద్దని చెప్పేస్తున్నారు.

 

దండాలు వేయడం వల్ల ఏమి ఉపయోగడం ఉండదని, వాటికి డబ్బులు వేస్ట్ అని, దాని బదులు పార్టీ కార్యకర్తలకు భోజనం పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇక సుధీర్ మాటలకు కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. సుధీర్ సింపుల్‌గా ఉండటాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి నాయకుడు ఉంటే పార్టీ కోసం మరింత ఉత్సాహంతో పనిచేయొచ్చని అనుకుంటున్నారు. అయితే సుధీర్ యాక్టివ్ అయిన శ్రీకాళహస్తి స్థానిక సంస్థల్లో వైసీపీకే మెజారిటీ సీట్లు దక్కే అవకాశముంది. అక్కడ ఎమ్మెల్యే మధుసూదన్ గట్టిగానే కష్టపడుతున్నారు.  కాబట్టి ఇక్కడ టీడీపీ పెద్దగా గెలిచే స్కోప్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: