వై.ఎస్‌.నే ఎదిరించావ్.. జగన్ ముందు చేతులు కట్టుకుంటావా.. సిగ్గులేదూ.. ఇదేం బతుకు..?

Chakravarthi Kalyan
మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ ఐదు రోజుల పాటు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధాలు సాగతున్నాయి. శ్రీనివాస్ ఇంటి నుంచి కేవలం రెండున్న ర లక్షల నగదు, కొంత బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నారని ఆదాయపు పన్ను శాఖ తాజాగా వెల్లడించిందంటూ టీడీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు.

ఐతే.. దీనిపై స్పందించిన బొత్స సత్యనారాయణ ...టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. శ్రీనివాస్ ఇంట్లో సీబీఐకి కీలక ఆధారాలు దొరికాయని అంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ క్యాబినెట్ లో బొత్సకు విలువంటూ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే జగన్ తదితరుల గుట్టు రట్టవుతుందని, పాపాలు బహిర్గతం కాబోతున్నాయని ఉమా అంటున్నారు.

దేవినేని ఉమా ఇంకా ఏమన్నారంటే.. “ “జర్మనీ, సెర్బియా, బ్రిటీష్ ఐలాండ్స్, ఇతర దేశాల్లో మీరు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తుతం సెర్బియా దేశంలో రిమాండ్ లో ఉన్నారు. ఈ డబ్బంతా కూడా ఏ1 ముద్దాయి జగన్ వద్దకు వెళ్లింది. ఈ వాస్తవాలన్నీ కూడా ఆ దేశం నుంచి ఈ దేశానికి ఇంటర్ పోల్, ఇతర సంస్థల ద్వారా వచ్చాయి. ఈ వివరాలన్నీ ప్రధాని మోదీ వద్ద, హోంమంత్రి వద్ద బట్టబయలయ్యాయి. ఈ కేసుల భయం తరముకొస్తుండడంతో జగన్ కుప్పిగంతులు వేస్తున్నారన్నారు మంత్రి ఉమ.

ఉమా ఇంకా ఏమన్నారంటే.. “ బొత్స గారూ మీరు వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ నే ప్రశ్నించారు. ఇప్పుడెందుకు చేతులు కట్టుకుని మాట్లాడుతున్నారు? మీకు ఈ క్యాబినెట్ పదవి అవసరమా? జగన్ ఏమేం మాట్లాడుతున్నాడో, ఎలా తిడుతున్నాడో మీడియా వాళ్లను అడిగి తెలుసుకో! ఆయన మాట్లాడిన మాటలు ఓసారి తలుచుకో! నిన్న నీ సహచర మంత్రే, పిచ్చాపాటీగా మంత్రులు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దని సూచిస్తున్నాడంటున్నారు ఉమ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: