దేశంలో అలా చేసింది జగన్ ఒక్కడే...

VUYYURU SUBHASH
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు....వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటూ...పాలనలో దూసుకుపోతున్నారు. తాను తీసుకునే నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చిన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లిపోతున్నారు. కానీ ఏ నిర్ణయమైన ప్రజలకు మంచి జరిగేలాగానే తీసుకుంటున్నారు. అయితే జగన్ ఆ ఐదు నెలల పరిపాలన కాలంలో అతి పెద్ద సంచలన నిర్ణయం ఏదైనా ఉందటే అది రివర్స్ టెండరింగ్. గత ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల్లో పాల్పడిన అక్రమాలకు చెక్ పెట్టేందుకు రివర్స్ టెండరింగ్ ని తీసుకొచ్చారు.


అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.100 కోట్లు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపేలా చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల ప్రాజెక్టు టెండరింగ్ పనుల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. అయితే జగన్ ఏపీకి జీవనాడి అయిన పోలవరంతో పాటు మిగతా ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. ఏదో గుడ్డిగా రివర్స్ టెండరింగ్ కు వెళ్ళడమే కాకుండా అందులో ప్రజా సొమ్ము ఎంత ఆదా అయిందో కూడా చూపించారు. 


కాకపోతే ఈ విధానంపై రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా విమర్శలు చేసింది. కానీ ఎప్పుడైతే రివర్స్ టెండరింగ్ కు వెళ్ళి ప్రజా ధనం వందల కోట్లు ఆదా అయిందో అప్పటి నుంచి ఎవరు పెద్దగా నోరు మెదపలేదు. ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ. 838 కోట్ల ఆదా అయింది. హెడ్‌ వర్క్స్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో రూ. 780 కోట్లు, టన్నెల్‌ పనుల్లో రూ. 58 కోట్లు ఆదా అయ్యాయి. 
భవిష్యత్ లో మరిన్ని వందల కోట్లు ప్రాజెక్టులో ఆదా కానున్నాయి. ఇక ఇదే విషయాన్ని జగన్...ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలకు చెప్పగా, వారు జగన్ని అభినంధించారు కూడా.


ఇక పోలవరమే కాకుండా రాష్ట్రంలోనే అక్రమాలు చోటు చేసుకున్న మిగతా ప్రాజెక్టుల్లో కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లనున్నారు. వేల కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేయనున్నారు. మొత్తానికి జగన్ చేపట్టిన ఈ ప్రక్రియ ఏపీ చరిత్రలో నిలిచిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: