అచ్చమైన తమిళ సంప్రదాయ డ్రెస్

DRK Raju
భారత దేశం మొత్తంలో  సంస్కృతి, సంప్రదాయాలను తుచ్చ తప్పకుండా పాటించే దక్షణాది రాష్ట్రాల్లో తమిళనాడును ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమిళుల  ఆచార వ్యవహారాలను ప్రపంచ దేశాలకు   చాటిచెప్పారు. సహజంగా విదేశీ పర్యటనల్లో  సూటు  బూతులో ఉండడం  సర్వసాధారమే. అందుకు  భిన్నంగా  ప్రధాని మోడీ అచ్చమైన తమిళ  సంప్రదాయం కొట్టొచ్చినట్లు డ్రెస్ వేసుకుని అందరి  దృష్టిని ఆకర్షించారు.  రెండు రోజుల పర్యటనకు  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత దేశానికీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనతో  కలిసి భారత ప్రధాని మోడీ తమిళనాడులోని చారిత్రక ప్రాంతమైన మహాబలిపురంలోని పాళీ చారిత్రిక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.



ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనలకు భిన్నంగా అచ్చమైన తమిళ  సంప్రదాయం కొట్టొచ్చినట్లు డ్రెస్ వేసుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రెండు స్ఫూర్తి దాయకమైన కార్యక్రమాలను చేపట్టారు. అందులో ఒకటి తమిళ సంప్రదాయాన్ని చాటి చెప్పడం. మరొకటి ఏంటంటే తాను పిలుపునిచ్చిన ప్లాస్టిక్ నిషేధం వ్యాప్తికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తానే స్వయంగా ప్లాస్టిక్ ఏరివేతను చేపట్టారు. సముద్ర తీరాన ప్రధాని ప్లాస్టిక్ ఏరుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


కాగా  మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య శనివారం ఫిషర్‌మెన్‌ కోవ్‌ రిసార్ట్స్‌ లో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. చర్చల అనంతరం ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గౌరవార్ధం లంచ్‌ ఏర్పాటు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ప్రధాని మోడీ 1000 సంవత్సరాల చరిత్ర కల అక్కడి కట్టడాలు..వాటి చారిత్రక ప్రాధాన్యతలు వివరించారు. జిన్‌పింగ్‌ విడిది చేసిన మహాబలిపురంలో చైనా అధ్యక్షుడితో కలిసి మోదీ చారిత్రక కట్టడాలను సందర్శించారు.



శోర్‌ ఆలయ ప్రాంగణాన్ని ఇరువురు నేతలు కలియతిరిగారు.మోదీ జిన్‌పింగ్‌లు ఆలయ ప్రాంగణంలో భేటీ అయ్యారు. కొబ్బరి నీరు సేవిస్తూ వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అంతకుముందు మహాబలిపురంలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచరథాలు కొలువుతీరిన ప్రదేశాలను వారు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్బంగా ఇరుదేశాధ్యక్షులు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: