శ్రీకాకుళం జిల్లాలో పోటెత్తిన నదుల వరద...

Gowtham Rohith
వాయువ్య బంగాళాకాతంలో పడిన వాయుగుండం ప్రభావంతో ఒడిస్సా లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో నదుల కు వరద పోటెత్తింది. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగుతున్నాయి. కరకట్టలు బలహీనంగా ఉన్న చోట ప్రవాహ తీవ్రతకు ఊళ్ళలోకి నీరు ప్రవేశిస్తుంది. వంశధార పై గొట్టా బ్యారేజ్ వద్ద లక్షా నాలుగు వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.గొట్టా బ్యారేజ్ వద్ద లక్ష పది వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నాగావళి లో డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లా అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పోలీసులు, రెవెన్యూ, ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తోటపల్లి ప్రాజెక్టుకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ ల నీరు రావడం పధ్ధెనిమిది వేల క్యూసెక్ ల నీటిని విడుదల చేస్తున్నారు. జియ్యమ వలస గరుగుబిల్లి మండలాలలో వరద పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పరిశీలించారు. వరద నీరు తగ్గే వరకు కూడా అధికారులందరని కూడా అక్కడ ఉండమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అని ఆవిడ పేర్కొన్నారు. పీఒ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అని తెలిపారు. ఇప్పుడే ముంపు ప్రాంతమైనటువంటి పాసింగ్ కి కూడా వెళ్ళి వచ్చామని అమె తెలిపింది. అక్కడ కూడా రాత్రికి అంతా బానే ఉందన్న పరిస్థితి. అక్కడ ఫెసిలిటీస్ కి కూడా  పీవో గారూ ఆదేశాలివ్వడం జరిగింది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నారు. ఎవరైతే పార్షియల్ గా కాని అదే విధంగా పూర్తిగా డ్యామేజీ అయిన ఇళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అధికారులని అప్రమత్తం చేయటం జరిగిందని ఆమె తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: