ఆ మాజీ మంత్రి నాలుక కోస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్యే..?

Chakravarthi Kalyan

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశం వైసీపీ- టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లాలని జగన్ నిర్ణయించడంపై టీడీపీ మండిపడుతోంది. కేంద్రానికి చెప్పకుండా పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.


పోలవరం టెండర్ల వ్యవహారంపై కేంద్రమంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించాలని ఆయన ఇటీవల డిమాండ్ చేశారు. సెర్బియా కేసుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదని ఉమా ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ తన స్వార్ధం కోసమే నిలిపివేస్తుందని మండిపడ్డారు. అంతేకాదు.. జగన్ టీమ్ లోని పీటర్ చెప్పినట్టుగానే అధికారులు నడుచుకుంటున్నారని విమర్శించారు.


జగన్ కు పోలవరం నిర్మాణంపై ఎలాంటి చిత్త శుద్ధి లేదని టీడీపీ నేత ఉమా అంటున్నారు. చక్కగా సాగుతున్న పోలవరం పనులకు జగన్ తన మూర్ఖత్వంతో అడ్డుపడుతున్నాడని ఉమా విమర్శించారు. జగన్ తీసుకుంటున్న చర్యల కారణంగా పోలవరం పూర్తయ్యేందుకు గడువు మరికొన్నేళ్లు పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే టీడీపీ విమర్శలకు వైసీపీ కూడా అంతే దీటుగా స్పందిస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమపై వైసీపీ ఎమ్మెల్యే కె.పార్దసారధి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దేవినేని ఉమా చేసేవి అర్దం పర్దం లేని ఆరోపణలు అంటూ మండిపడ్డారు. జగన్ సర్కారుపై అసత్య ప్రచారాలు సాగిస్తే ఉమా నాలుకు కోస్తామని ఆయన హెచ్చరించారు.


దేవినేని ఉమ.. తన హయాంలో చేతకాని దద్దమ్మ మాదిరి వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఉమా నీతులు చెబుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఉమా మహేశ్వరరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని పార్ధసారధి హెచ్చరించారు. మరి ఈ మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందో.. ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: