కొనసాగుతున్న ఇసుక మాఫియా దందా..

SEEKOTI TRIMURTHULU

 ఇచ్చాపురం కేంద్రంగా ఇటు ఒడిశా నుంచి అటు ఉత్తరాంధ్రా జిల్లాల వరకు సాగిపోతున్న ఇసుక మాఫియాను నిర్మూలించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నూతన విధానాన్ని అమలుచేశారు. గతంలో అమలైన  ఉచిత ఇసుకవిధానంలో చాలా లోపాలు ఉన్నాయంటూ, తాజా ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాలకు రూపకల్పన చేసి, అమల్లోకి తీసుకు వచ్చేందుకు మరో రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఈ లోగ నిర్మాణాలకు ఇసుక ఎలా అనేది ప్రభుత్వం తెలపలేదు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేప్పట్టిన వారు వాటిని ఇపూర్తిచేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.

ఇటుక లేకుండా ఇల్లు కట్టేయవచ్చు గానీ , ఇసుక లేకుండా ఆ పని చేయలేమని అదే అక్రమార్కులకు కలసివచ్చిన అవకాశమని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో జిల్లాలో వంశధార , నాగావళి , మహేంద్ర తనయ, బాహుదా నదుల నుంచి ఇసుక తీసేవారు. వీటిలో బాహుదా , మహేంద్రతనయ నదులకు ఇసుక ర్యాంపులు లేవు. అధికారికంగా ర్యాంపులు లేకపోవంతో  అక్రమార్కులు ఇసుకను దోచుకుంటున్నారు.

అలా తీసిన ఇసుకలో కేవలం ఐదు శాతం మాత్రమే స్థానికంగా ఉపయోగించుకుని, మిగిలిన ఇసుకను విశాఖపట్నానికి తరలించేవారు. ట్రాక్టర్లతో నది నుంచి ఇసుకను తెచ్చి, సురక్షిత ప్రాంతాలలో కుప్పలు పోసి , ఆ పై అర్ధరాత్రి సమయంలో లారీల్లో గమ్యానికి చేర్చేవారు. కానీ ప్రస్తుతం ఇసుక తవ్వకాలు తగ్గాయి. అయితే ఇప్పటికే రాశులు పోసి ఉంచిన ఇసుకను కొద్దిరోజులు విక్రయించకుండా ఉంచి, ధర పెంచి అమ్ముకుంటున్నారు. గతంలో రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు లారీ ఇసుక ధర పలికేది. ఇప్పుడు కొరత పేరిట ఇసుకు ధరను పెంచి అమ్ముతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: