Photo Feature - మరో సుందర రామం, శనివారం ప్రారంభం

Shyam Mohan

హైదరాబాద్‌ ప్రజలకు , గ్రామీణ వాతావరణాన్ని పరిచయం చేస్తున్న మాదాపూర్‌లోని శిల్పారామం తరహాలోనే మరొక సుందర రామం, శివారు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఉప్పల్‌ పమీపంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2018లో మున్సిపల్‌ డెవలప్‌ మెంట్‌ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ కళా వేదికకు పునాది పడింది. మరి కొన్ని రోజుల్లో మినీ శిల్పారామాన్ని ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఉప్పల్‌-నాగోల్‌ ప్రధాన రహదారికి సమీపంలో, నాగోల్‌ మెట్రో రైలు డిపో దగ్గర, మూసీనది తీరంలో మినీ శిల్పారామాన్ని నిర్మించారు.

9.5 ఎకరాల్లో…. ఆధునిక నగరంలో గ్రామీణ వాతావరణం ఈ శిల్పారామం ప్రత్యేకత. ఇప్పటి వరకు ఒక్క చోటుకే పరిమితమైన శిల్పారామం సంస్క తిని మరోచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌, మూసీ నదిని అనుకొని ప్రాంతంలో HMDA కు చెందిన 9.5 ఎకరాలను శిల్పారామానికి కేటాయించారు.

 శిల్పారామం నిర్మాణానికి హెచ్‌ఎండీఏ రూ.10కోట్లతో పనులు చేసేందుకు ప్రతిపాదనలు చేసింది. ఈ పనులను టూరిజం శాఖ ఆధ్వర్యంలో మొదలై పూర్తయి తుది మెరుగులు దిద్దుకొంటోంది. హైటెక్‌ సిటీ లోని శిల్పారామానికి ఉన్న ప్రధాన ఆర్చి తరహాలో ఉప్పల్‌ శిల్పారామాని, ఏర్పాటు చేశారు. శనివారం  ప్రారంభించ బోతున్నారు .

Photos of  New Shilparamam






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: