తెలంగాణా 2018 ఎన్నికలు - హై లైట్స్ !

KSK
తెలంగాణా ఎన్నికలలో ఇప్పటి వరకూ ఉన్న  హైలైట్స్ ఒక్కసారి చూద్దాం :
- సినిమా ఇండస్ట్రీ లో దాదాపు పెద్ద స్టార్ హీరోలు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామ్ చరణ్ మాత్రం తనకి అనుకోని కారణాల వలన వీలు పడ్డం లేదు అని తెలిపాడు. ఎన్టీఆర్, మహేష్ బాబు చిరంజీవి తదితరులు క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ..


-  కేసీఆర్ దంపతులు తమ స్వగ్రామమైన  చింతమడకలోని ప్రభుత్వ పాఠశాలలోకి సతీసమేతంగా వచ్చారు. చింతమడక పోలింగ్ కేంద్రంలో అధికారులను బూత్ లో సమస్యలపై కేసీఆర్ ఆరా తీశారు.  కేసీఆర్ కు ఓటరు స్లిప్పులను అక్కడే ఉన్న మంత్రి హరీష్ రావు అందజేశారు. కేసీఆర్ ఓటు వేసేందుకు ఏర్పాట్లను హరీష్ రావు దగ్గరుండి చూశారు.  కెసిఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా కనపడ్డం విశేషం.


- హైదరాబాద్ మెట్రో ఎలక్షన్ సందర్భంగా స్పెషల్ టైమింగ్ లో షెడ్యూల్ ని ఏర్పాటు చేసింది ..  నాగోల్ - మియాపూర్ - ఎల్బీ నగర్ మెట్రోస్టేషన్ ల నుంచి చివరి ట్రైన్ రాత్రి 11.30 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇక అమీర్ పేట మెట్రో స్టేషన్ నుంచి చివరి ట్రైన్ రాత్రి 12.15 గంటలకు బయలు దేరుతుంది అని తెలిపారు మెట్రో అధికారులు 


- తెలంగాణా  జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
ఖమ్మం(13శాతం) - రంగారెడ్డి(10శాతం) - భద్రాద్రి కొత్తగూడెం(15శాతం) - ఆసిఫాబాద్(14శాతం) - ఆదిలాబాద్(12శాతం) - మంచిర్యాల(15శాతం) - నిర్మల్(14శాతం) - కరీంనగర్(13శాతం) - సిరిసిల్ల(16శాతం) - జగిత్యాల(16శాతం) - పెద్దపల్లి(10.5శాతం) - నల్గొండ(17.81శాతం) - మహబూబ్ నగర్(16.5శాతం) - కామారెడ్డి(15శాతం) - నిజామాబాద్(12.5శాతం) - జోగులాంబ గద్వాల(19శాతం) - వనపర్తి(15శాతం) - నాగర్ కర్నూల్(10.6శాతం) - వరంగల్ అర్బన్(11.23శాతం) - వరంగల్ రూరల్(13.5శాతం) - సంగారెడ్డి(19శాతం) - సిద్ధిపేట(16శాతం) - మెదక్(14శాతం) - యాదాద్రి భువనగిరి(14.5శాతం) - సూర్యాపేట(15.28శాతం) - జనగామ(13.27శాతం) - భూపాలపల్లి(14.5శాతం) - మహబూబాద్(16.2శాతం) - మేడ్చల్(14.3శాతం) - వికారాబాద్(19.5శాతం)


- మరొక పక్క మాజీ టీడీపీ నేత ప్రస్తుతం ఆలేరు బీ ఎల్ ఎఫ్ అభ్యర్ధి మోత్కుపల్లి నరసింహులు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్యం అనుకోకుండా ఎమర్జెన్సీ అయ్యింది. భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. 
- దర్శకుడు రాఘ వెంద్ర రావు కి ఫిలిం నగర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. లైన్ లో నిల్చోకుండా నేరుగా ఓటు వెయ్యడం కోసం వెళ్ళిన ఆయన్ని జనం నిలదీసారు. అప్పుడు ఆయన సైలెంట్ గా వెనక్కి రావాల్సి వచ్చింది. 
- పోలింగ్ బూత్ లో సెల్ఫీ లు నిషిద్దం అని మొదటి నుంచీ చెప్తున్నారు .. నిబంధనలు అతిక్రమించిన వారికి తగిన శిక్ష ఉంటుంది అని ఎలక్షన్ కమీషన్ హెచ్చరిస్తూ నే ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో శివశంకర్ అనే యువకుడు తన మొబైల్ ఫోన్ ను పోలింగ్ బూత్ కు తీసుకొచ్చాడు. ఓటేసిన అనంతరం అక్కడే సెల్ఫీ దిగాడు. పోలీసులు శివ శంకర్ ని అరస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళారు. 


- కూకట్ పల్లి నియోజికవర్గం భరత్ నగర్ లో పాడు బడ్డ ఇంట్లో దాదాపు అరవై ఎనిమిది ఓట్లు ఉన్నట్టు తేలడం తో ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. మనుషులు లేని ఇంట్లో అన్ని ఓట్లు ఎలా వచ్చాయని కలకలం రేపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటర్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి..
- తన పేరు ఎన్నికల లిస్టు లో లేదు అంటూ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల ట్విట్టర్ లో పేర్కొంది .
- భార్య నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ బాబు వచ్చి జుబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూడా పలువురు సినీ స్టార్లు ఓటు వేశారు. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల, నటుడు నరేష్, హీరో వేణు దంపతులు ఈ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: