ఫెయిలయ్యాం ! కనీసం పూలన్నా ఇద్దాం !

హైదరాబాద్ మా అబ్బ సొత్తు.. కాక మీ అబ్బ సొత్తా ? అని అడిగిన నాడే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దొరతన్నాన్ని నిలదీశారెందరో.. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ కి ఎదురు మాటలాడిన వారి మాటకు ఎక్కువ విలవనవ్వలేదు మీడియా.

హైదరాబాద్ మా అబ్బ సొత్తు అన్న నాయకులు అదే హైదరాబాద్ కు జరిగిన ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో అనే విషయం పక్కన పెడితే.. మొన్నటికి మొన్న ఇంకొక హుకుం జారీ చేశారు. మా హైదరాబాద్ లో మీరు ఎలా సభ నిర్వహిస్తారో చూస్తం అని.

సీమా ఆంధ్ర వాళ్లు ఎల్బీ స్టేడియానికి రావాలనుకుంటే తెలంగాణ బార్డర్ దాటి రావాలి. ఆ బార్డర్ ని ‘తెలంగాణ బంద్ ’ అనే పేరుతో మూసేస్తే ఎవ్వరూ రాలేరు అనే ధీమా కాబోలు. కానీ HMDA ( గ్రేటర్ హైదరాబాద్ ) పరిథిలో ఉన్న ముప్పయి రెండు లక్షలకు పైగా సీమాంధ్ర జనాల గురించి మర్చిపోతే ఎలా.. అనే విషయాన్ని ఆలోచించినట్లు లేరు.

బంద్ అన్నా.. టైర్లలో గాలి తీసినా.. రాళ్లు రువ్వినా .. బస్సులు నిలిపివేసినా.. వేలు, లక్షలు తరబడి సభకు చేరుకుంటున్న ఉద్యోగులను చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయినట్లుంది గులాబీ బాసులకు. మా హైదరాబాద్ లో మా పర్మిషన్ లేకుండా సభ ఎలా నిర్వహిస్తారన్న బాసులు ఇప్పడు తరలి వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి మాట మార్చారు. మేము ఏపిఎన్జీవోల సభకు వ్యతిరేకం కాదు. వాళ్లందరికీ పూలు ఇచ్చి మరీ సాగనంపుతాం అంటున్నారు. అదేమి విచిత్రమో ఏమో మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: