ఆ అన్నా చెళ్లెళ్లు.. భార్యభర్తలయ్యారు.. ఎలాగో తెలుసా..!?

Chakravarthi Kalyan
కొన్ని సినిమాలు చూస్తే.. అబ్బా వీళ్లు తీస్తారు.. కానీ నిజంగా ఇలా జరుగుతుందా..  అని కొట్టిపారేస్తాం.. కానీ కొన్ని వాస్తవాల్లో కల్పితాలకు మించిన డ్రామా ఉంటుంది. విధి ఆడే వింత నాటకం వంటి పదాలు, సామెతలు అలాంటి వాటిని చూసే పుడుతుంటాయి. ఔను.. అమెరికాలో జరిగిన ఈ సంఘటన చూస్తే నిజంగా ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే.. 

ఇద్దరు అన్నా చెళ్లెళ్లు.. అందులోనూ కవలలు.. అనుకోకుండా భార్యాభర్తలయ్యారు. విచిత్రమేమిటంటే.. ఆ విషయం వారికి కూడా తెలియదు. ఓ విచిత్రపరిస్థితిలో ఆ వాస్తవం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. వారిద్దరూ కవల పిల్లలు. ఒకరు ఆడ, మరొకరు మగ. ఓ ప్రమాదం కారణంగా చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. వారిని వేరు వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. 


అలా దత్తత తీసుకున్నవారికి తాము తీసుకున్న బిడ్డకు తోబుట్టువులున్నారని తెలియదు. ఇద్దరు వేరు వేరు చోట్ల పెరిగి పెద్దవారయ్యారు. అనుకోకుండా ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు. వారి మధ్య పరిచయం పెరిగింది. అది మొదట స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది. తమ మధ్య కాస్త పోలికలు ఉండటం.. ఇద్దరి పుట్టిన రోజులూ ఒకటే కావడం వారికి తెలిసినా అదంతాకాకతాళీయం అనుకున్నారు. 

అరే భలే కలిసిందే అనుకున్నారే తప్ప తాము కవలలమని ఊహించలేకపోయారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. పిల్లలు పుట్టే విషయంలో ఆలస్యం కావడంతో వారు వైద్యపరీక్షలకు వెళ్లిన సమయంలో వైద్యులు ఇద్దరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. అప్పుడు బయటపడంది అసలు విషయం. ఆ భార్యాభర్తలిద్దరూ కవల పిల్లలని, తోబుట్టువులని వైద్యులు నిర్థారించారు. సినిమా కథను మరపించిన ఈ ఘటన అమెరికాలోని మిస్సిసిపిలో జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: