ప్రవాస భారతీయుడు జైట్లీ దుర్మరణం...!!!

NCR

అమెరికాలో స్థిరపడాలని ఎన్నో కలలతో వెళ్లి వ్యాపారవేత్తగా నిలదొక్కుకున్న ఓ వ్యాపారవేత్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే. జైట్లీ అనే ప్రవాస భారతీయుడు తన కుటుంభంతో సహా అమెరికాలో స్థిరపడ్డాడు. గురువారం వ్యాపార రీత్యా న్యూ ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్ లోకి అద్దెకి దిగారు.

 

ఈ క్రమంలోనే జైట్లీ తండ్రి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయక పోవడంతో హోటల్ స్టాఫ్ కి ఫోన్ చేసి జైట్లీ తో మాట్లాడాలని కోరాడు. అయితే ల్యాండ్ లైన్ ద్వారా కాల్ చేసినా తీయకపోవడంతో యాజమాన్యం అతడు ఉన్న గది తాళం తీసి చూడగా అతడు స్పృహ కోల్పోయి ఉండటం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయాడు నిర్ధారించారు వైద్యులు.

 

ఈ సంఘటనపై హోటల్ యాజమాన్యం పోలీసు లకి ఫిర్యాదు చేయగా వారు కేసు దర్యాప్తు చేస్తున్నామని. కానీ ప్రాధమికంగా చూస్తే అతడి మరణం సహజంగానే జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తరువాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: