అమెరికా సంచలన నిర్ణయం..!!!

NCR

అమెరికాలోని అలబామా రాష్ట్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎక్కడా లేని విధంగా ఆ రాష్ట్రం అబార్షన్ లని నిషేధించింది. ఆ రాష్ట్రంలో ఎవరైనా సరే అబార్షన్ల కి పాల్పడితే ఖటినమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడమని హెచ్చరించింది. ఇప్పుడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. వివరాలలోకి వెళ్తే..

 

అలబామా రాష్ట్రంలో గత కొంతకాలంగా అబార్షన్ బిల్లుపై ఊగిసలాడుతున్న అక్కడి ప్రభుత్వం తన నిర్ణయాని ప్రకటించింది. ఎంతో వివాదాస్పదమైన బిల్లుకి. తమ రాష్ట్రంలో పూర్తిగా అబార్షన్లు నిషేధమనని ప్రకటించింది. అయితే ఒక వేళ తల్లి ఆరోగ్యానికి ప్రమాద సమయంలో తప్ప అన్ని రకాలుగా అబార్షన్ల ని నిషేధించింది. అబార్షన్లు చేయడం ఇకనుంచి చట్టవిరుద్దమని ప్రకటించింది.

 

అయితే ఈ నిబంధనలను ఉల్లంఘన చేసిన వారికి 99 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపింది ప్రభుత్వం. 1973  లో అమెరికన్ సుప్రీంకోర్టు అబార్షన్లు దేశవ్యాప్తంగా చట్టబద్దం చేసింది.  కానీ కోర్టు  తీర్పును సమీక్షించిన సెనెట్ ఈ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై  అమెరికా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు, మహిళా హక్కుల కార్యకర్తలు , స్వచ్చంద సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: