"గ్రీన్ కార్డుల" పెంపు..భారత టెకీలకి ఇది నిజంగా "శుభవార్తే"

Bhavannarayana Nch

అమెరికా వంటి అగ్రరాజ్యంలో తమకంటూ ఒక శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని కలలు కనే వారికి..ఎంతో అమెరికాలో భవిష్యత్తు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎంతో మంది స్టూడెంట్స్ పై ఐటీ రంగ నిపుణులకి అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..ప్రతిభ ఆధారిత వలస విధానం లో ఏడాదికి 45 శాతం గ్రీన్ కార్డులను ఇచ్చేందుకు అమెరికా ప్రతినిధుల సభలో చట్టాన్ని ప్రవేశపెట్టింది...ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఈ సంవత్సరం గ్రీన్ కార్డుల సంఖ్య 1.20 లక్షలు నుంచి 1.75 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ చట్టాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంది.


అమెరికాలో ఎక్కువగా స్థిరపడుతున్న విదేశీయులలో ఎక్కువగా మెక్సికో ,చైనా ,తరువాత మన భారత్ దేశాల వారు ఉన్నారు..భారత్ మూడవ స్థానంలో ఉంది..అయితే మొన్నటివరకూ ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలు ఎంతో మంది భారతీయుల ఆశలని ఆవిరి చేసేవిధంగా ఉన్నాయి..అయితే ఎంతో నైపుణ్యం కలిగిన విదేశీ వ్యక్తులని తమ దేశంలోనే ఉంచుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు..

 

అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికీ కలిసోచ్చిందో లేదో కానీ..దేశ విదేశాల నుంచీ ముఖ్యంగా భారత్ నుంచీ దిగుమతి చేసుకుంటున్న ఐటీ సంస్థలకి ఎంతో ఊరట లభిస్తోంది..అలాగే విసా పొడిగించే విధానానికి కూడా చరమగీతం చెప్పాలని భావిస్తోంది..అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే..ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడుతున్న చాలామంది తమ కుటుంబ సభ్యులను కూడా అమెరికా తీసుకెళ్తున్నారు. ఇకపై అలాంటివి ఉండబోవని అమెరికా స్పష్టం చేసింది. అక్కడ స్థిరపడిన ఉద్యోగుల పిల్లలు లేదా తోబుట్టువులు, తల్లిదండ్రులకు మాత్రమే ఈ సదుపాయం కల్పించనున్నారు...అమెరికా పెట్టిన ఈ రూల్స్ ని పాటించకపోతే తప్పకుండా చర్యలు తప్పవు అని అంటున్నారు..ఏది ఏమైనా సరే గ్రీన్ కార్డుల పెంపు ఎంతో మంది ఐటీ నిపుణులకి వరంగా మారింది అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: