రోల్స్ రాయిస్ కారులో.. పోలీసులు పెట్రోలింగ్.. ఎక్కడో తెలుసా?

praveen
సాధారణంగా ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు లిస్టు తీస్తే అందులో రోల్స్ రాయిస్ కారు మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పాలి. చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు రోల్స్ రాయిస్ కార్ ను కొనుగోలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. అచ్చంగా మిడిల్ క్లాస్ వాళ్లు తమ జీవితంలో ఒక్కసారైనా కారు కొనుగోలు చేయాలని ఎలా అయితే అనుకుంటారో.. అలాగే కొంతమంది సంపన్నులు సైతం రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేయాలని అని అంటూ ఉంటారు.  ఎందుకంటే పెద్ద పడవలా హొయలోలికించే కార్లకు రోల్స్ రాయిస్ ప్రసిద్ధి. అయితే కేవలం కొంతమందికి మాత్రమే రోల్స్ రాయిస్ కారును అమ్మడం చేస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే ఇలా ఎవరైనా రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసినప్పటికీ దానిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ.. ఇక ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే వాడటం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పోలీసులు పెట్రోలింగ్ కోసం ఇలా రోల్స్ రాయిస్ కారుని వాడటం సంచలనంగా మారిపోయింది. సాధారణంగా అయితే ఇక పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే వాహనాలతో ఎప్పుడూ అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఖరీదైన కారును పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్రోలింగ్ వాడుతున్నారు. ఫ్లోరిడా లోని మియామీనగరంలో పోలీసులు ఇలా విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారును ఉపయోగించి నగరం అంతా పెట్రోలింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

 చాలామంది ఆ కారు ఎక్కడమే గొప్ప అని భావిస్తూ ఉంటారు. అలాంటిది సెలబ్రిటీలు ధనవంతులు మాత్రమే వాడే రోల్స్ రాయిస్ కారును ప్రపంచంలోనే తొలిసారి పెట్రోలింగ్ కు వాడి రికార్డు సృష్టిస్తున్నారు మియామి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు. రోల్స్ రాయిస్ లో ఘోస్ట్ మోడల్ అయిన ఈ కారు ధర దాదాపు 8 కోట్లకు పైమాటే. ఇక ఈ మధ్య మియామీ పోలీస్ శాఖలో చేరడానికి యువత ఉత్సాహం చూపకపోవడంతో.. ఎక్కువ మందిని ఆకర్షించడానికి అక్కడి అధికారులు ఇలాంటి ప్రయత్నం చేశారట. ఈ క్రమంలోనే రోల్స్ రాయిస్  కారులో తిరగడానికైనా ఎంతోమంది యువత పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి ముందుకు వస్తారు అని ఉద్దేశంతో ఇక ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: