రష్యా సంచలన నిర్ణయం.. తాలిబన్లతో చేయి కలిపేందుకు రెడీ?

praveen
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ల  ప్రభుత్వం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్ బద్దంగా కొనసాగుతున్న ప్రభుత్వాన్ని ఆయుధాలతో కుప్పకూల్చి కొత్త ప్రభుత్వమే ఏర్పాటు చేశారు తాలిబన్ల. ఈ క్రమం లోనే కఠినమైన రూల్స్ తో ఏకంగా ప్రజలను బానిసలుగా మార్చుకొని.. అక్కడ పాలన సాగిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఎవరైనా తప్పు చేస్తే ఏకంగా దారుణమైన శిక్షలు విధిస్తున్నారూ. ఆడపిల్లలను ఆట బొమ్మలుగా మార్చుకొని ఇక కఠినమైన ఆంక్షలు వారి జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు అని చెప్పాలి.

 అయితే ఇలా తాలిబన్ల దారుణమైన పాలన కొనసాగిస్తుండటం తో ప్రపంచ దేశాలు ఇక ఆఫ్గనిస్తాన్ తో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకున్నాయి. దీంతో ఇక తాలిబన్ల ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఏర్పడాల్సిన పరిస్థితి. అయితే అన్ని దేశాలు ఇలా తాలిబన్లతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఎక్కడ ఆసక్తిని చూపించడం లేదు. కానీ ఒక రష్యా మాత్రం వారితో సత్సంబంధాల కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తుంది. అన్ని దేశాలు తాళిబన్లను ఉగ్రవాదులు అని ప్రకటిస్తుంటే రష్యా మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

 ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన తాలిబన్ గ్రూప్ ను నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి రష్యా తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ దేశ అధికారిక వార్త సంస్థ ఆర్ఐఏ నవోస్జీ ఇటీవల ఈ విషయాన్ని తెలిపింది. అయితే త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి పేర్కొనడం సంచలనంగానే మారిపోయింది అని చెప్పాలి. ఇలా తాళిబండ్లపై తాలిబన్లఅంచర్జాతీయంగా ఎన్నో రకాల అంశాలు ఉన్నప్పటికీ రష్యా మాత్రం వారితో సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉండడం సంచలనంగా మారిపోయింది. అయితే ఇలా ప్రపంచ దేశాలను కాదని తాళిబన్లతో రష్యా చేతులు కలిపిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది కూడా హాట్టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: