శత్రువులను వెన్నుపోటు పొడిచేలా.. కొత్త సైన్యాన్ని సిద్ధం చేస్తున్న చైనా?

praveen
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను వెనక్కి నెట్టి అగ్ర దేశంగా ఎదగాలని ఇండియా సహా మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ దేశ జీడీపీని పెంచుకుంటూ.. ఆర్థిక వ్యవస్థను బలపరుచుకుంటూ ముందుకు సాగాలని అనుకుంటూ ఉంటాయి. కానీ ఒక్క చైనా మాత్రం ఇలా అగ్ర దేశంగా ఎదిగేందుకు ఎప్పుడు దొడ్డదారులను వెతుకుతూ ఉంటుంది. ఎవరు ఊహించిన విధంగా నీచమైన పనులు చేస్తూ ఇక తన దేశ ఎదుగుదలను కోరుకుంటు ఉంటుంది చైనా.

 గతంలో కరోనా వైరస్ అనే ఒక మహమ్మారి వైరస్ విషయంలో కూడా చైనా ఇలాంటి ఆలోచన చేసిందని వాదనలు ఉన్నాయి. కరోనా వైరస్ రూపంలో ప్రపంచ దేశాలపై చైనా బయో వెపేన్ ప్రయోగించిందని.. ఇక ఈ బయో వెపన్ ద్వారా అన్ని దేశాలను ఆర్థికంగా దెబ్బ కొట్టి.. అలాంటి సమయంలోనే ఇక చైనా అగరదేశంగా ఎదగాలని అనుకుంది అంటూ అప్పట్లో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి నీచమైన పని చేసేందుకు చైనా సిద్ధమైంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

 బలమైన సైనిక వ్యవస్థతో ఇప్పటికే పొరుగు దేశాలపై ఆదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా ఇక ఇప్పుడు మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. చైనా తీసుకున్న నిర్ణయం కాస్త ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మిలటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు చైనా శ్రీకారం చుట్టిందట. అదే సైబర్ సైన్యం. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ గా పిలుచుకునే విభాగానికి యుద్ధాలను గెలిపించే సామర్థ్యం ఉందని చైనా నమ్ముతుందట. అయితే ఇలా సైబర్ సైన్యం ద్వారా ఇతర దేశాలకు సంబంధించిన సైనిక రహస్యాలను తెలుసుకొని.. ఆయా దేశాలను దెబ్బకొట్టేలా ప్రతి వ్యూహాలు పన్నెందుకు  చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: