చేతి వెంట్రుకతో.. గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది?

praveen
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవాలి అంటే ఎంత టాలెంట్ ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు   అయితే ప్రపంచ రికార్డు అనే మాట మాట్లాడుకోవడానికి చాలా సింపుల్ గానే ఉన్నప్పటికీ.. ఇలాంటి రికార్డు సాధించడం అనేది అంత సులభైరమైన విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో స్పెషల్ టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రికార్డు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రపంచ రికార్డు సాధించడం కోసం ఎంత ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విన్యాసాలు చేసి ప్రపంచ రికార్డుల్లో తమ పేరును ఎక్కించుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం కొంతమంది ఎంతో సింపుల్గా వరల్డ్ రికార్డులు కొట్టేస్తున్నారు. రోజు చేసే పనులనే కాస్త కొత్తగా ట్రై చేసి ఇక గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి వాటి గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇంత సింపుల్గా కూడా ప్రపంచ రికార్డు సృష్టించవచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక వరల్డ్ రికార్డు గురించే.

 ఇక్కడ ఒక మహిళ ప్రపంచ రికార్డు సృష్టించింది. అయితే గతంలో  పొడవాటి జుట్టు, గడ్డంతో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించడం చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల ట్రేస్సీ మేసి అనే మహిళ మాత్రం చేతి వెంట్రుకతో ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. చేతి పై భాగాన ఆమె 18.40 cm అంటే 7.24 అంగుళాల పొడవున్న వెంట్రుకను పెంచింది. ఇక చేతిపై అత్యంత పొడవాటి వెంట్రుక ఇదే కావడం గమనార్హం. దీంతో గిన్నిస్ బుక్ రికార్డ్స్ వారు చివరికి ఆమెకు ప్రపంచ రికార్డుల్లో చోటు కల్పించారు. అయితే 2012లోనుండి కూడా ఈ వెంట్రుకను పెంచుతున్నట్లు ట్రేసి మేసి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: