రూ. 42 కోట్ల జాక్ పాట్.. ఈ విషయం తెలియగానే అతనేం చేశాడో?
దీంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇంత భారీ మొత్తం జాక్పాట్ తగలడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇక భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న అతను ఏం చేసాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే 42 కోట్ల జాక్పాట్ గెలుచుకున్నట్లు తెలియగానే ఆ పెద్దాయన తనకోసం ఒక వాటర్ మెలన్ భార్య కోసం పూలు కొనుగోలు చేశాడట. మాన్ రోజ్ బడ్ అనే 77 ఏళ్ల వ్యక్తి కులరాడో లొట్రో అనే లాటరీ లో జాక్పాట్ విన్నర్ గా నిలిచాడు.
ఏకంగా ఐదు మిలియన్ డాలర్లకు పైగా ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రిటైర్ అయిన అతను వచ్చిన తర్వాత వెబ్సైట్లో తాను కొనుగోలు చేసిన టికెట్ను చెక్ చేసి చూపిస్తాడు. అయితే ఏకంగా ఐదు మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు తెలిసి షాక్ అయ్యాడు. అయితే ముందుగా పొరపాటు పడ్డానేమో అని అనుకుని మళ్ళీ చెక్ చేశాడు. కానీ ఇక తన కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు వచ్చిన జాక్పాట్ నిజమే అని తేలింది. దీంతో అతను ఆనందంతో ఎగిరి గంతేసాడు అని చెప్పాలి. ఇకపోతే ఇక బడ్ దంపతులు ఆ డబ్బుతో ఏం చేయాలన్నది ఇంకా ప్లాన్ చేసుకోలేదట. కొన్ని డబ్బులు చారిటీలకు ఇస్తామని ఇంకొన్ని ఏం చేయాలో ఆలోచిస్తాం అంటూ ఈ దంపతులు చెప్పుకొచ్చారు.