అమెరికా వెళ్తున్నారా.. సోషల్ మీడియాలో జాగ్రత్త?
గతేడాది లక్షనర నుంచి రెండు లక్షల మంది యువత అమెరికా వెళితే ప్రస్తుతం రెండున్నర లక్షలకు పైగా వెళ్లడం చూస్తుంటే ఈ సంఖ్య భారీగానే పెరిగిపోయింది. ప్రతి ఏటా 200 మంది విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో దొరికి బయటకు వస్తుంటారు. కానీ ఈ ఏడాదిలో ఇప్పటికే 500 మంది స్టూడెంట్లు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకే సారి 21 మందిని వెనక్కి పంపడంతో అసలు ఇబ్బంది ఇప్పుడే ప్రారంభం కానుంది.
అంటే అమెరికాకు వచ్చే వారు.. ఇండియా నుంచి ఏ ప్రాంతం నుంచి ఫేక్ కన్సల్టెంట్ ఇతర తప్పుడు సమాచారంతో వస్తున్నారని గమనిస్తారు. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అని తెలిస్తే ఇకపై అమెరికాలో గట్టి నిఘా పెడతారు. ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్నంగా పరిశీలిస్తారు. ప్రతి ఒక్కరు అమెరికా కు పై చదువులకు వెళ్లాలనుకోవడం అక్కడ పడే ఇబ్బందులు తదితర కారణాలను ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుంటారు.
అమెరికా రాగానే పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా.. ఎక్కడ పని చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసాల మీద వెళ్లే వారిపై అమెరికా మరో రకంగా కన్ను పెట్టింది. తమకు అనుమానం వచ్చిన వారి సామాజిక పోస్టులు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. తొలిరోజునే పార్ట్ టైం ఉద్యోగం చేయొచ్చా.. ఫీజులకు సంబంధించిన వాటికి బ్యాంకు ఖాతాల్లో ఎలా చూపాలి. స్నేహితులతో సంభాషణ జరిపి ఉంటే వారిని కచ్చితంగా వెనక్కి పంపడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.