
యువతి శవపేటికలో వింత శబ్దాలు.. 11 రోజుల తర్వాత తవ్వి చూస్తే?
అయితే ఇలా చావు వరకు వెళ్లి వచ్చిన వారిని మృత్యుంజయులు అని పిలుస్తూ ఉంటారు అని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి విచిత్రమైన ఘటన గురించి. ఒక యువతి చనిపోయింది. ఆమెకు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఒక బాక్స్ లో పెట్టి భూమిలో తవ్వి పెట్టారు. అయితే 11 రోజులు గడిచిపోయాయి. కానీ ఆ యువతి సమాధి నుంచి వింత శబ్దాలు రావడం మొదలైంది. దీంతో గమనించిన కాటి కాపరి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసాడు. అయితే 11 రోజుల తర్వాత ఆ శవపేటికను తవ్వి చూస్తే షాకింగ్ దృశ్యం కనిపించింది.
ఈ ఘటన ఉత్తర బ్రెజిల్ లో వెలుగులోకి వచ్చింది. 37 ఏళ్ల మహిళా అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. కుటుంబ సభ్యుల ఆసుపత్రిలో చేర్పిస్తే వైద్యులు చనిపోయిందని నిర్ధారించారు. చివరికి మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారూ. అయితే మృతదేహాన్ని శివపేటికలో పెట్టి వారి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కానీ ఆ శవపేటిక నుంచి పెద్ద శబ్దాలు రావడం గమనించిన కాటి కాపరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. ఇక 11 రోజుల తర్వాత మళ్లీ తవ్వి చూసారు. చివరికి చేతులన్నీ రక్తంతో తడిసి ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే ఆమెను పూడ్చే సమయంలో మాత్రం ఎలాంటి రక్తం లేకపోవడం గమనార్హం. మళ్లీ ప్రాణం వచ్చినా ఆమె బయటికి వచ్చేందుకు ఎంతో ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు బయటకు తీసేలోపే ప్రాణాలు వదిలింది.